Home Cinema Dil Raju : తండ్రి మరణ బాధను తట్టుకోలేక దిల్ రాజు ఎంత పనిచేసాడంటే..

Dil Raju : తండ్రి మరణ బాధను తట్టుకోలేక దిల్ రాజు ఎంత పనిచేసాడంటే..

dil-raju-emotional-feelings-about-his-father-death

Dil Raju : తెలుగు సినిమా రంగంలో చిత్ర నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకొని ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో నిర్మాతగా వ్యవహరించి, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి దిల్ రాజు. ఈరోజు దిల్ రాజ్ ఇంట్లో విషాదం ( Dil Raju emotional feelings ) నెలకొంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి 86 సంవత్సరాలు అనారోగ్య కారణంగా చనిపోయారు. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. దిల్ రాజు తల్లి పేరు ప్రమీలమ్మ . దిల్ రాజ్ తెలంగాణలోని నిజామాబాద్ లో ఈ కుటుంబంలో జన్మించగా.. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు.

See also  Balagam : అవతార్ తో అక్కడ పోటీ పడతున్న బలగం..

Dil-father-death-sad

దిల్ రాజ్ మొదటి భార్య కూడా 2017లో చనిపోగా.. ఆయన 2020లో మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. మొదటి భార్యతో ( Dil Raju emotional feelings ) ఒక కూతురు హర్షిత ఉంది. ఆ తర్వాత 2020లో ఆయన తేజస్విని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అంట. ఆయనకు అనేక ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్నారంట. ఇక అవన్నీ ఫలించకపోగా సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన మరణించడం జరిగిందంట. ఈరోజు ఆయన అంత్యక్రియలు చేస్తున్నారు.

Dil-father-death-news

సినిమా రంగంలో పలువురు ప్రముఖులకు ఈ విషయం తెలిసి దిల్ రాజును పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడ ఆయన తండ్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే క్రమంలో ప్రకాష్ రాజు కూడా దిల్ రాజును పలకరించడానికి ( Dil Raju emotional feelings ) వెళ్లారు. దిల్ రాజు దగ్గరకు వెళ్లి ప్రకాష్ రాజు ఓదార్చడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో దిల్ రాజు ఒక చిన్న పిల్లల్లాగా ఆయనని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. దిల్ రాజు ఈ వయసులో తన తండ్రి కోసం అంతే ఎక్కెక్కి ఏడుస్తూ ప్రకాష్ రాజును పట్టుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Kriti Sanon : సంచలనం సృష్టిస్తున్న కృతి సనన్ ఎంగేజ్మెంట్ ట్విస్ట్..

Dil-father-death

ఎంతటి వారికైనా ఎంతటి స్థాయికి వెళ్లిన తల్లిదండ్రులు ప్రాధాన్యత ఏమిటో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.ఎన్నో ఉన్నా కూడా మనల్ని కన్న తల్లిదండ్రులు వెళ్లిపోతే.. ఏదో కోల్పోయినట్టు, అన్ని ఒక్కసారిగా పోయినట్టు, మనం ఏదో ఒంటరిగా అనాధలం అయిపోయినట్టు.. చిన్నపిల్లల్లాగా ఎక్కి ఎక్కి ఏడవాలని అనిపిస్తుంది. అదే తల్లిదండ్రుల్లో ఉన్న గొప్పతనం. వాళ్ళు ఇచ్చే ప్రేమలో అంతా ఆప్యాయత, అంతా ధైర్యం ఉంటుంది. అలాంటి ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఏ వయసులోనైనా కూడా వాళ్ల తల్లిదండ్రులు లేకపోతే ఇలాగే ఎక్కి ఎక్కి ఏడుస్తారని అర్థమవుతుంది. ప్రకాష్ రాజు ఇంకా ఇతర ప్రముఖులు ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది.