Home Cinema Naresh – Ashish : అటు నరేష్ పవిత్ర.. ఇటు ఆశిష్ రూపాలి మళ్లీ పెళ్లిలో...

Naresh – Ashish : అటు నరేష్ పవిత్ర.. ఇటు ఆశిష్ రూపాలి మళ్లీ పెళ్లిలో ఎంత తేడా?

difference-between-naresh-pavitra-and-ahish-rupali

Naresh – Ashish : ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం అంటే టీనేజ్ లోను, యూత్ లోను జరిగే పని మాత్రమే అని పూర్వం అనుకునేవారు. కానీ ప్రేమ అనేది ఏ వయసులోనైనా పుడుతుందని.. పెళ్లి అనేది ఏ వయసులోనైనా చేసుకోవచ్చు అని సెలబ్రిటీస్ ఇలాంటి పనులు చేయడం వలన .. ఈ తరంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయని ( Naresh Pavitra and Ahish Rupali ) ఒప్పుకోక తప్పడం లేదు. ఇటీవల సింగర్ సునీత రెండవ పెళ్లి చేసుకుని అందరికీ ఒక షాక్ ఇచ్చింది. ఈ వయసులో ఈమె మళ్లీ పెళ్లి చేసుకుంది అని మొదట్లో అనుకున్నా కూడా.. ఆ తర్వాత ఆమె ఆనందకరమైన ముఖాన్ని చూసి.. మంచి పని చేసింది, ఒక తోడు దొరికింది అని అందరూ అనుకుంటున్నారు.

difference-between-naresh-pavitra-and-ahish-rupali

అలాగే నరేష్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకొని మూడో భార్యను కూడా దూరంగా పెట్టి పవిత్రతో రిలేషన్ ఏర్పడి ఆమెతోనే ఇకపైన జీవితం, మేమిద్దరం మంచి ప్రేమికులం అని అంటున్నాడు. వీళ్ళ ప్రేమ గురించి, వీళ్ళకి ఉన్న బంధం ( Naresh Pavitra and Ahish Rupali ) గురించి ఏకంగా మళ్లీ పెళ్లి అనే సినిమాను కూడా తీసేశాడు నరేష్. వీళ్ళపై జనాలు ఎన్నో కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అతి కొద్ది మంది పాజిటివ్గా రియాక్ట్ అయితే.. ఎక్కువ మంది నెటిజనులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాగే మరోపక్క ఆశిష్ విద్యార్థికి 60 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి జరిగింది. ఆశిష్ విద్యార్థిని కూడా మొదటి భార్యకి విడాకులు ఇచ్చి.. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో రెండవ పెళ్లి చేసుకుకోగా.. ఎన్నో కామెంట్స్ ఎదురయ్యాయి. ఈ వయసులో ఇతనికి పెళ్లి ఏంటి? 33 ఏళ్ల రూపాలీ అనే ఆమెని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఒకవేళ అతను చేసుకుందామనుకున్నా..

See also  Anasuya Bharadwaj: తన అందాలతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న యాంకర్ అనసూయ..

difference-between-naresh-pavitra-and-ahish-rupali

ఆమె చేసుకోవడానికి కారణం ఏమిటి? చచ్చేలోపు ఈమెకు ఏమైనా ఆస్థి ఇస్తాడని అందుకోసమే పెళ్లి చేసుకున్నాడని.. ఎన్నో కామెంట్లు చేశారు. అయితే రుపాలీ వయసు 33 కాదు, ఆమె వయసు కూడా 50 సంవత్సరాలు.. అంటే ఆమెకి ఆశిష్ విద్యార్థికి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే తేడా. ఇదిలా ఉంటే నరేష్ పవిత్రల మధ్య బంధం గురించి.. నరేష్ మాజీ మూడవ భార్య ఎలాంటి మాటలను అంటుందో.. ఆమె వీళ్ళకి వ్యతిరేకంగా ( Naresh Pavitra and Ahish Rupali ) ఎలాంటి ఫైట్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. ఆశిష్ మొదటి భార్య పిలువు అలియాస్ రాజోషి బారువా నిఇంటర్వ్యూ చేయగా.. అహిష్ నుంచి విడిపోయిన కూడా సోషల్ మీడియాలో ఆమె పేరు ఇప్పటికీ విద్యార్థి అనే ఆయన సర్ నేమ్ ని తియ్యలేదు.

See also  Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

difference-between-naresh-pavitra-and-ahish-rupali

వీళ్లిద్దరు గత అక్టోబర్లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆమెని ఆశిష్ ఎలాంటి వాడు అని అడగ్గా.. ఆశిష్ చాలా మంచివాడని.. 22 ఏళ్ల మేమిద్దరం కలిసి ఉన్నామని.. అందులో ఎన్నో మేము గుర్తుంచుకునే తీపి గుర్తులు ఉన్నాయని.. ఆయన మీద ఎలాంటి కంప్లైంటు లేదని.. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకుంటే కూడా ఆయనకు ఒక తోడు దొరికిందని ఆనందిస్తాను తప్ప తిట్టుకోనని.. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంది కానీ.. మా దారులు వేరవడం వల్ల ఒకరితో ఒకరు ఉండడం కరెక్ట్ కాదని దూరంగా ఉన్నామని చెప్పింది. ఆయన నా కోరికలు ఎప్పుడు తొక్కేయడం కానీ.. నన్ను ఎప్పుడూ అణిచివేయడం గాని.. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదని.. ఆశిష్ చాలా మంచి మనిషి అని చెప్పుకొచ్చింది. నరేష్ ,పవిత్ర , వాళ్ళ ముందు భార్య మరియు భర్తల మాటలకి.. ఆశిష్ మళ్ళీ పెళ్లి కి ఎంత తేడా ఉందొ చూడండి..