Ram Charan: మెగాస్టార్ చిరంజీవి వారసునిగా తెలుగు సినిమా ప్రపంచంలోనికి అడుగు పెట్టి ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్.. తనదైన నటన ప్రతిభ తో తన టాలెంట్ ను బయట పెడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో రూపుదిద్దుకుంటున్నవే.. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులతో చాలా బిజీ బిజీగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఎన్నో ఇంటర్వ్యూల నడుమ బయటకు వచ్చిన ఓ విషయం ఏంటంటే.. రామ్ చరణ్ మొట్ట మొదట నటించిన చిత్రం ఏది అనే ఒక విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. (Did You Know Ram Charan)
మనందరికీ తెలిసిందే.. ఆయన నటించిన మొదటి చిత్రం ఏది అని అడిగితే టక్కున చిరుత అనే చెబుతారు. కానీ చిరుత కంటే ముందే రామ్ చరణ్ ఓ చిత్రంలో బాల నటుడుగా నటించాడట.. ఇక ఈ విషయం చాలా మందికి తెలియనే తెలియదు. మరి ఇంతకీ రామ్ చరణ్ బాల నటుడిగా చేసిన ఆ చిత్రం మరేదో కాదు లంకేశ్వరుడు ఇక ఈ చిత్రమే రామ్ చరణ్ బాల నటుడిగా నటించిన ఏకైక చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ జంటగా నటించారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు దాసరి నారాయణరావు. దాసరి దర్శకత్వం వహించిన 100వ చిత్రం ఇది. (Did You Know Ram Charan)
ఇక ఈ చిత్రానికి వడ్డ రమేష్ నిర్మాతగా వహించగా విజయ మాధవి కంబైన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంలోని పాటలకు రాజ్ కోటి సమకూర్చగా.. రేవతి, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, నాజర్ మొదలైన వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రం 1989 వ సంవత్సరంలో విడుదలైంది. ఇక ఈ సినిమాలోని రామ్ చరణ్ బాల నటుడిగా ఓ సన్నివేశంలో నటించాడట.
ఇక ఇదే సమయంలో తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ కలిసి వర్కౌట్ చేస్తున్న స్టిల్స్ కూడా మనకు ఫోటోలు కనిపించనున్నాయి. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా నటించాడు. కానీ వెండి తెరపై అతని పాత్ర మాత్రం కనిపించలేదు. దానికి ముఖ్య కారణం ఉంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సినిమాను ఎడిట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ నటించిన ఆ సన్నివేశం మరి అతికించినట్లుగా ఉందని డైరెక్టర్ దాసరి నారాయణరావుకు అనిపించడంతో.. ఆ సన్నివేశాన్ని తొలగించాడట.. ఒకవేళ ఆ సీను ఈ సినిమాలో ఉంచినట్లయితే రామ్ చరణ్ బాల నటుడిగా నటించిన తొలి చిత్రం లంకేశ్వరుడే అయి ఉండేది.