Samantha-Chaitulu: సోషల్ మీడియాలో కనీసం రోజుకు ఒక్క సారైనా సమంత పేరు వినపడకుంటే ఫిల్మ్ వార్తలు మూగబోయినట్టే సోషల్ మీడియా జనాలకి కునుకు కూడా పట్టదు. అవును సమంత నాగచైతన్ల పేరు ప్రతి రోజు కనీసంలో కనీసం ఒక్క సారైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారకుండా అస్సలు ఉండనే ఉండదు. ఏదో ఒక చిన్న విషయం దొరికిన ప్రతి సారి వీళ్ళ గురించి తెగ వైరల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో.. ఇక వీరు చేసే కొన్ని పనుల వల్ల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ట్రెండింగ్ లో కూడా కొనసాగుతూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలోనే సమంత నాగ చైతన్యకు సంబంధించిన పెళ్లి ఫోటోని ఆమె ఇంస్టాగ్రామ్ లోనే ఆర్చీవ్ లో పెట్టుకోవడం వల్ల చైతు మధ్య ఉన్న రిలేషన్ మరొకసారి బయటపడింది.
అలాగే నాగ చైతన్య ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన మాజీ భార్య సమంత పై ఎవరెన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ పాజిటివ్ గానే స్పందిస్తాడు తప్పితే నెగటివ్గా ఏనాడు స్పందించలేదు. సరే ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయి. అయితే మన అసలు విషయాన్నీ పక్కన పెడితే.. వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి మరియు విడాకులు తీసుకోవడానికి గల కారణం మన తెలుగు స్టార్ హీరోనే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ స్టార్ హీరో వల్లే చైతు సామ్ ల మధ్య ప్రేమ పుట్టిందని.. ఏం మాయ చేసావే చిత్రం యొక్క షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడి అది కాస్త పదేళ్ల ప్రేమ కొనసాగి చివరకు పెళ్లి వరకు వెళ్ళింది వివాహమనంతరం ఎంతో అన్యోన్యంగా ఉంటారనుకుంటే విడాకులకు వరకు వెళ్లి చివరికి ఎవరి దారి వారు చూసుకున్నారు.
మరి అసలు ఎవరా స్టార్ హీరో చెప్పేదేదో సక్కగా చెప్పు బాబు అని మీరు అడగొచ్చు. అక్కడికే వస్తున్న అయితే సమంత చైతు పరిచయం కావడానికి గల కారణం ఏం మాయ చేసావే చిత్రం. అయితే మొదట ఈ చిత్రం తీద్దాం అనుకున్నది అక్కినేని నాగచైతన్యతో కాదట సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో నే అట. ఇక ఈ కథ మహేష్ బాబుకి చెప్పగా తనకి కథ సెట్ అవ్వదు అని రిజెక్ట్ చేశాడట. దాంతో నాగచైతన్యతో ఈ సినిమా చేస్తే బాగుంటుందని ఈ సినిమా చేయడంతో సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఒకవేళ మహేష్ బాబు గనుక ఈ చిత్రం రిజెక్ట్ చేయకుండా ఇందులో సమంత సరసన నటించి ఉంటే సమంతకు (Samantha-Chaitulu) అక్కినేని నాగచైతన్య పరిచయం అయ్యేవాడు కాదు ఆ పరిచయం ఇంత దూరం వెళ్లేవాడు కాదు.
ఒకవేళ సినిమా రిజెక్ట్ చేయకుండా సమంత మహేష్ బాబులు ఇద్దరు ఏం మాయ సినిమా చేసి ఉండేవారు అలా మహేష్ బాబు ఈ చిత్రాన్ని చేస్తే చైతు సామ్ ప్రేమ చిగురించేది కాదు. అలాగే విడాకులు తీసుకుని విడిపోయే వాళ్ళు కూడా కాదు. ఈ తెలుగు హీరో వల్లే వీళ్ళిద్దరి మధ్య ఏం మాయ చేసావే సినిమా ద్వారానే ప్రేమ పుట్టింది అంట కొంతమంది నేటిజన్స్ మహేష్ బాబు పేరుని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు అభిమానులు ఏమో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది గాని మహేష్ బాబు నటించిన ఇలా జరిగింది నటించకుంటే ఇంకోలాగా జరిగిందంటూ మా హీరో పై నిందలు వేయడమేంటని వారికి రివర్స్ లో కౌంటర్లు వేస్తున్నారు.