Home Cinema Charan-Bunny: బన్నీ ప్లేసులో చరణ్.. కొంప ముంచేసిన స్టార్ డైరెక్టర్.. చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్..??

Charan-Bunny: బన్నీ ప్లేసులో చరణ్.. కొంప ముంచేసిన స్టార్ డైరెక్టర్.. చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్..??

Did ram charan: తెలుగు చిత్ర పరిశ్రమలో అతి పెద్ద ప్రాజెక్టుగా నిర్మించబోతున్న సినిమా చేతులు మారిందా.? అంటే కచ్చితంగా అవుననే సమాధాన వినిపిస్తుంది కొందరి టాలీవుడ్ సినీ ప్రముఖులలో. ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ డైరెక్షన్ లో తెరకక్కబోతున్న సినిమా జవాన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ లేడీస్ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

did-ram-charan-steal-allu-arjun-movie-offer-from-that-top-director

అయితే ఈ జవాన్ సినిమా అయిపోయిన తర్వాత మన తెలుగులో స్టార్ హీరో అయినటువంటి బన్నీతో సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడంట డైరెక్టర్ అట్లీ. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రీన్ పనులు మొత్తం పూర్తిచేసుకుని ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను మొత్తం బన్నీకి వివరించారట.. బన్నీ కూడా ఈ సినిమా కథ మొత్తం నచ్చి ఓకే కూడా చెప్పాడట. దాంతో బన్నీ ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశారంటూ న్యూస్ కూడా వైరల్ అయింది.

See also  Pawan kalyan: ఆ ఒక్క పనికి ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ 1000 కోట్లు సంపాదించొచ్చు..

did-ram-charan-steal-allu-arjun-movie-offer-from-that-top-director

కానీ ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ అట్లీ నిర్మించబోయే ఈ సినిమాను తెరకెక్కించే విధంగా బన్నీ ప్లాన్ చేసుకున్నాడట. అయితే పుష్ప 2 సినిమాను సుకుమార్ చాలా లేట్ చేయడంతో డైరెక్టర్ అట్లీ ఆ సినిమా పూర్తయ్యేంతవరకు ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో ఆపలేక మరొక హీరోని వెతుక్కున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు చరణ్. బన్నీ చేయాలనుకున్న ఈ చిత్రానికి చరణ్ కచ్చితంగా సెట్ అవుతాడు అనుకుని ఇందుకోసం చరణ్ సంప్రదిస్తున్నారట. (Did ram charan)

See also  SriMukhi - Avinash: శ్రీ ముఖి కి కిస్ పెట్టేసిన అవినాష్. చెంప చెల్లుమనిపించిందా.?

did-ram-charan-steal-allu-arjun-movie-offer-from-that-top-director

ఇదేకాక ప్రస్తుతం చరణ్ నటించిన ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోయి అన్ని అవార్డులను తీసుకొస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే ఈ మూవీ అట్లీ-చరణ్ కాంబో తెరకెక్కితే మాత్రం అది పక్కాగా హాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసే విధంగా అవుతుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దాంతో బన్నీ ఆఫర్ చరణ్ ఖాతాలో పడ్డట్లేనని అర్థమవుతుంది. మళ్లీ మరొకసారి ఇదే క్రమంలో మెగా-అల్లు అభిమానుల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతుంది. సోషల్ మీడియాలో మరొకసారి వీరి ఫ్యాన్స్ మధ్య పెద్ద కొనసాగిపోతుంది.