Home Cinema మెగా అభిమానులకి షాక్ – నిలిచిపోయిన గేమ్ చేంజర్ షూటింగ్. నా వల్ల కాదంటున్న శంకర్

మెగా అభిమానులకి షాక్ – నిలిచిపోయిన గేమ్ చేంజర్ షూటింగ్. నా వల్ల కాదంటున్న శంకర్

Game Changer: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయునిగా అడుగు పెట్టి మెగా పవర్ స్టార్ గా ఎదిగినటువంటి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం గేమ్ చేంజర్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇండియన్ కెమెరూన్ గా పేరు తెచ్చుకున్న శంకర్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నది. కాగా ఈ సెన్సేషనల్ చిత్రాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా పేరు కాంచినా దిల్ రాజు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ.. ఈ పాటికి ఇప్పటికే విడుదల కూడా అవ్వాల్సింది. కానీ.. పలు అడ్డంకుల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటి వరకు కూడా విడుదల అవ్వలేదు.

See also  Allu Arjun Fans: పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ రష్మిక ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఎక్కేస్తున్నారు గా.. అసలు కథ ఇదా..

did-ram-charan-movie-game-changer-shooting-stopped-director-shankar-dont-want-to-do-this-anymore

ఇక ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. కాగా శంకర్ ఒక్కో పాటను పదిహేను కోట్ల బడ్జెట్ తో ఏకంగా మొత్తం ఆరు పాటలకి 90 కోట్లు బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ విషయం దిల్ రాజుకు చెప్పిన దానికంటే రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో దిల్ రాజు సైతం శంకర్ పై కాస్త అసంతృప్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నాడు అంటూ పలు రకాల వార్తలు ఇప్పటికే ఎన్నో రాసాగాయి. కాగా ఇటు గేమ్ చేంజర్ తో పాటు అటు ఇండియన్ 2 చిత్రాలు కూడా ఒకే సారి తెరపైకి ఎక్కిస్తుండడంతో.. ఏం అర్థం కాని అయోమయ పరిస్థితిలో మెగా అభిమానులు తల పట్టుకు కూర్చున్నారు.

See also  Sreeleela : విజయ్ దేవరకొండ తో గేమ్స్ ఆడుతున్న శ్రీలీల..

did-ram-charan-movie-game-changer-shooting-stopped-director-shankar-dont-want-to-do-this-anymore

అసలు గేమ్ చేజర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఆ తర్వాత ఎప్పుడు విడుదల అవుతుందో అర్థం కావడం లేని పరిస్థితి ఏర్పడింది. అసలు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం సంక్రాంతి కే ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఈ చిత్రానికి షూటింగ్ పూర్తిగా బ్రేక్ పడిపోయింది. అసలు ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు నత్త నడకన కంటే దారుణంగా కొనసాగుతూ ఉండడంతో.. దిల్ రాజు సైతం ఎంతో అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా.. ఈ చిత్రం ఏడాది కూడా థియేటర్లోకి వచ్చేలా లేదని మనకు తెలుస్తుంది. ఇంకా చాలా మొత్తంలో షూటింగ్ పెండింగ్లో ఉందని మనకు అర్థమవుతుంది. (Game Changer)

See also  Baby Movie Actress: అలాంటి పని బాత్రూంలో చేసానంటూ స్వయంగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆ నిజాన్ని బయట పెట్టింది

did-ram-charan-movie-game-changer-shooting-stopped-director-shankar-dont-want-to-do-this-anymore

శంకర్ అటు ఇటు రెండు పడవల పై భారీ ప్రాజెక్టులు చేతుల పట్టుకోవడం మూలాన ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తయితుందో తెలియలేకున్నది. అటు ఇండియన్ 2 కూడా ఇంకా పూర్తి చేయాల్సి రావడంతో బడ్జెట్ కూడా పూర్తి కంట్రోల్ తప్పేసింది అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. కాగా పలువురు సినీ విశ్లేషకులు చెప్పిందాని ప్రకారం చూస్తే వచ్చే సంవత్సరం ఆగస్టు లేదా ఆ తర్వాత ఈ గేమ్ చేంజ్ విడుదల అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనాప్పటికీ మెగా అభిమానులకి ఇది షాకింగ్ వార్త అని చెప్పాలి షూటింగ్ పూర్తి ఎప్పుడు అవుతుందో చెప్పలేక పోతున్నారు.