Dhruva Sarja: కన్నడ హీరో ధ్రువ సబ్జా గురించి చాలామందికి తెలుసు. 2012లో అద్దురి అనే సినిమాతో ధ్రువ సర్జ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ధ్రువ సర్జా అర్జున్ సర్జా కి మేనల్లుడు అవుతాడు. అర్జున్ సత్య కి ( Dhruva Sarja and Chiranjeevi Sarja ) మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధ్రువ సర్జాకి మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ధ్రువ సర్జా చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. భాషా బేధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వార్తని వెంటనే ఏమిటా అని చూస్తున్నారు.
ధ్రువ సర్జా స్వర్గీయ నటుడైన చిరంజీవి సర్జాకి స్వయంగా సోదరుడు. ధ్రువ ససర్జాకి తన అన్న చిరంజీవి సర్జా అంటే చాలా ఇష్టం అంట. ఆయన్ని ఇప్పటికీ మర్చిపోవడం కష్టంగానే ఉందంట. ఆ బాధ నుంచి ఆయన ఇంకా తేరుకొనేలేదంట. అయితే ( Dhruva Sarja and Chiranjeevi Sarja ) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ధ్రువ సర్జా భార్యకు శ్రీమంతం వేడుక చేశారు. ఈ వేడుకకు అనేకమంది బంధువులు, స్నేహితులు విచ్చేసి ఆమెను ఆశీర్వదించారు. అయితే వచ్చిన వారందరూ ఒకటే ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను ఆ వేడుకను చేసిన ప్రదేశమే ఎందుకు ఇక్కడే ప్రత్యేకించి చేసుకున్నాడు అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం కూడా మొదలుపెట్టారు.
గతంలో తన అన్న చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ధ్రువ సర్జా భార్య కడుపుతో ఉంటే ఆమెకు శ్రీమంతం చేసే క్రమంలో కృష్ణాష్టమి రోజున వాళ్ళ అన్న చిరంజీవి సర్జా సమాధి ( Dhruva Sarja and Chiranjeevi Sarja ) ఉన్న ఫార్మ్ హౌస్ లో శ్రీమంతం వేడుకను చేశారు. అయితే ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఒకటే.. సాధారణంగా కడుపుతో ఉన్న వాళ్ళని చాలా వాటికి దూరంగా ఉంచుతారు. చాలా మంచి ప్లేసెస్ లో వాళ్ళని పెడతారు. అలాంటిది ధ్రువా సర్జా తన భార్యని ఏకంగా వాళ్ళ అన్న సమాధి ఉన్న ఫార్మ్ హౌస్ దగ్గరికి తీసుకువచ్చి అక్కడ సీమంతం చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంట్లో చేసుకునే ఈ వేడుక తన అన్నకి దగ్గరలో చేసుకుని ఆయన జ్ఞాపకార్థంగా మిగుల్చుకోవాలని ధ్రువ సర్జా అభిప్రాయమేమో. కానీ కొందరేమో కడుపుతో ఉన్న మనిషిని అలాంటి ప్లేస్ లో పెట్టి శ్రీమంతం చేయడమేంటని అంటున్నారు. ఏదేమైనా నమ్మకాలు అనేవి మనం సృష్టించుకున్నవే. బంధాలు అనేవి మాత్రం ఆ భగవంతుడు మనకిచ్చిన వరాలు. మనిషి మూఢ నమ్మకం కంటే కూడా బంధానికి విలువడమే మంచిది. మూఢనమ్మకాలు వలన వచ్చేది ఏమిటో అనేది అనేది గాలిలో దీపం లాంటిది.. కనిపించని ఈ నమ్మకాలను నమ్మే కంటే.. కనిపిస్తూ మనతో పాటు పుట్టి పెరుగుతున్న మనుషులకు, రక్తసంబంధీకులకు విలువ ఇవ్వడం నిజంగా ఈ రోజుల్లో ఎంతో గొప్పతనం. అందుకనే ధ్రువ సర్జా ని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు..