Home Cinema Dhanush : ధనుష్ ని ప్రేమించి వాళ్ళ అన్నని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. రీజన్ తెలిస్తే...

Dhanush : ధనుష్ ని ప్రేమించి వాళ్ళ అన్నని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. రీజన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

dhanush-love-sonia-agarwal-but-married-his-older-brother

Dhanush : ధనుష్ అంటే అన్ని భాషల వారికి ఎంతో ఇష్టం. అదే ధనుష్ లో ఉన్న స్పెషల్. ధనుష్, సోనియా అగర్వాల్ అనే హీరోయిన్ ని ప్రేమించాడు. సోని అగర్వాల్ అనే హీరోయిన్ ఎవరో మీ అందరికీ తెలిసిందే. 7/G బృందావన్ ( Dhanush love Sonia Agarwal ) కాలనీ ఈ సినిమా పేరు వినగానే ఆమె గుర్తుకొస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని నిలబెట్టింది ఆమె ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే లవర్స్ అందరూ కూడా ఈ సినిమాని ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ఆ తర్వాత విపరీతమైన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్లు వర్షం కురిపించింది. ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది.

Dhanush-love-sonia-Agarval-marriage-with

7/G బృందావన్ కాలనీ సినిమా తర్వాత సోని అగర్వాల్ ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే చాలామందికి తెలుసు ధనుష్.. సెల్వ రాఘవన్ తమ్ముడే అన్న విషయం తెలియదు. అయితే ( Dhanush love Sonia Agarwal ) కోలీవుడ్ స్టార్ అయిన ధనుష్ సోని అగర్వాల్ ఇద్దరూ కలిసి కాదల్ కొండేన్ అనే సినిమాలో హీరో, హీరోయిన్స్ గా నటించారు. ఆ సినిమాకి కూడా దర్శకుడు ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ నే.. ఆ సినిమా టైంలో ధనుష్, సోనియా అగర్వాల్ ఇద్దరూ ప్రేమించుకోవడం జరిగింది. అప్పుడే ఒక అనుకోని సంఘటన వాళ్ళ జీవితాల్లోకి ఎదురయింది. దానితో వాళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది.

See also  Anushka Shetty: అనుష్క శెట్టి ప్రేమించిన ఆ ఏకైక వ్యక్తి ప్రభాస్ మాత్రం కాదట.. మరి ఎవరు.?

Dhanush-love

 

వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న టైంలో రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో ధనుష్ కి పెళ్లి సంబంధం వచ్చింది. దానికి వెంటనే ధనుష్ తండ్రి ఓకే చెప్పేసారు. దానితో చేసేదేమీ లేక ధనుష్.. సోనియా అగర్వాల్ కి ఉన్న విషయం చెప్పి.. సారీ చెప్పి, ఇక ఆమె లైఫ్ లో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆమె విపరీతమైన డిప్రెషన్ లోకి ( Dhanush love Sonia Agarwal ) వెళ్లిపోయి బాధలో ఉండిపోయింది. అలాంటి టైం లో ఆమెకి 7/G బృందావన్ కాలనీ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం కెరీర్ మీదే మనసు పెట్టాలని ఆలోచించుకొని ఆ సినిమాకి ఒప్పుకుంది. అయితే ఆ సినిమా చేసే క్రమంలో ఆ సినిమా దర్శకుడు ధనుష్ సోదరుడు అయిన సెల్వ రాఘవన్, సోనియా అగర్వాల్ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకున్నారు.

See also  Sai Dharam Tej : చిన్న వయసులోనే ఆ తప్పు చేసి సూసైడ్ అటెమ్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ని కాపాడిన మెగా హీరో ఎవరో తెలుసా?

Dhanush-love-marriage

అయితే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది కానీ కారణాలు ఏమిటో తెలీదు గానీ.. వీళ్ళిద్దరి పెళ్లి ఎంతో కాలం నిలబడలేదు. వాళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. అలా ధనుష్ ని ప్రేమించి.. వాళ్ళ అన్నతో పెళ్లి చేసుకుని.. అక్కడ కూడా బంధం నిలబడక విడిపోయింది. ఇలా వాళ్ళిద్దరి ప్రేమ, పెళ్లి నిలబడలేదు. పెళ్లి చేసుకున్న కొంతకాలానికి విడిపోయారు. అప్పట్లో కోలీవుడ్ మీడియా మొత్తం ధనుష్, సోనియా అగర్వాల్ గురించి, వాళ్ళ ప్రేమ గురించి తెగ వార్తలు వ్రాసేవారు. ఆ తర్వాత ధనుష్ అన్న సెల్వ రాఘవన్ తో ఆమెకు పెళ్లి అయిన తర్వాత కొంత సైలెంట్ అయిపోయారు.