
Dhanush : ధనుష్ అంటే అన్ని భాషల వారికి ఎంతో అభిమానం. తెలుగు సినిమా అభిమానులకు కూడా ధనుష్ సినిమా అంటే ఎంతో ఇష్టం. కాబట్టే ధనుష్ ప్రతి సినిమాని తెలుగులో కూడా డబ్ చేయడం జరుగుతుంది. ఇటీవల రిలీజైన ధనుష్ సినిమా ( Dhanush Begger look in the Kubera movie ) రాయన్ ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందిందని అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంది. ధనుష్ హీరో మాత్రమే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆయనే వహించారు.
ధనుష్ నటనతో పాటు మొదటిసారిగా దర్శకత్వం వహించడంతో, అది కూడా ఆయన సినిమాకే ఆయన దర్శకత్వం వహించడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఊహించినంతగా ఈ సినిమా హిట్ కాలేదని అంటున్నారు. ధనుష్ నటన మీద ( Dhanush Begger look in the Kubera movie ) పెట్టిన ఫోకస్ దర్శకత్వ మీద పెట్టలేకపోయాడని, సినిమాలో ఎమోషన్ ని సరిగ్గా పండించలేకపోయాడని, సెకండ్ హాఫ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాడని విమర్శలు అయితే వినిపించడం జరిగాయి. ఈసారి ధనుష్ దర్శకత్వం అనే బాణం గురితప్పిందని అనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ధనుష్,కింగ్ నాగార్జున ఇద్దరి కాంబినేషన్లో కుబేర అనే పాన్ ఇండియా సినిమా వస్తున్నట్లుగా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని నేషనల్ అవార్డు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం చేస్తున్న విషయం ( Dhanush Begger look in the Kubera movie ) తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్ అంటే అందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంది. అయితే ఈరోజు ధనుష్ పుట్టినరోజు. ధనుష్ పుట్టినరోజు నాడు చిత్ర బృందం వాళ్ళు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ధనుష్ బిచ్చగాడిగా కనిపించాడు.
సినిమా పేరు చూస్తే కుబేర ఉంది, రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అందులో హీరో బిచ్చగాడుగా ఉన్నాడు.. ఇదేమిట అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది పక్కన పెడితే.. ధనుష్ పుట్టినరోజు పూట అతన్ని అలా బిచ్చగాడుగా రిలీజ్ చేశారేంటని మరికొందరు అనుకుంటున్నారు. సాధారణంగా హీరో పుట్టినరోజు అంటే పుట్టినరోజు సందర్భంగా మంచి మంచి స్టైలిష్ పోస్టర్లు ఏమైనా రిలీజ్ చేస్తారు కానీ.. బిచ్చగాడుగా రిలీజ్ చేయడం కొత్తగా ఉందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..