Home Cinema Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా.??

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా.??

Devi Sri Prasad Going To Get Married: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మొత్తానికి ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడట.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా చెక్కర్లు కొడుతుంది. మనందరికీ తెలిసిందే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కాలం పాటు సంగీత ప్రపంచాన్ని ఏలిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో సినీ చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నాడు.

devi-sri-prasad-going-to-get-married-with-that-girl-who-is-she

ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ పుష్ప సినిమాల్లో ఊ అంటావా మామ ఊ ఊ అంటావా పాట హిట్ కారణంగా దేవిశ్రీప్రసాద్ పేరు అడపాదడప నాలుగైదు సార్లు వినిపిస్తూనే ఉంది. కానీ ఆ తర్వాత తమన్ దెబ్బకి దేవిశ్రీప్రసాద్ బొక్క బోర్లా పడ్డాడు. ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్ కి అవకాశం ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు రావడం లేదు. ఎవ్వరు చూసినా సరే తమన్ పేరునే జపిస్తున్నారు. దాంతో దేవిశ్రీప్రసాద్ యొక్క చాప్టర్ క్లోజ్ అనే విధంగానే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

See also  Varun Tej : పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే వరుణ్ తేజ్ ఆ హీరోలతో బ్యాచులర్ పార్టీ లో ఆ నిజాలు చెప్పేశాడట..

devi-sri-prasad-going-to-get-married-with-that-girl-who-is-she

ఇలాంటి క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వ్యాపిస్తున్నాయి. పెళ్లి చేసుకోవడానికి డేట్ కూడా ఫిక్స్ అయిందట.. మనందరికీ తెలుసు గతంలో ఛార్మితో దేవిశ్రీప్రసాద్ ప్రేమయానం నడిపాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఏమైందో ఏమో సడన్గా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు.. దేవి శ్రీ ప్రసాద్ గారి తండ్రి మరణించిన తర్వాత తాను పెళ్లి పైన అసలు ఇంట్రెస్ట్ చూపించే వాడు కాదట..

See also  Mahesh babu & Trisha: త్రిష పెట్టిన ఆ చిచ్చు వల్లే మహేష్ నమ్రత కాపురంలో గొడవలు సంభవిస్తున్నాయా.?

devi-sri-prasad-going-to-get-married-with-that-girl-who-is-she

కానీ మొత్తానికి ఇన్నేళ్లకు వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు దేవిశ్రీప్రసాద్. మరి దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. తన సొంత మరదల్ని.! దేవి శ్రీ ప్రసాద్ కి (Devi Sri Prasad Going To Get Married) వరుసకు మరదలు ఈ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వివాహానికి సినీ ప్రముఖులు ఎవరు హాజరు అవ్వడం లేదంట.. ఎందుకంటే ఈయన పెళ్లిని హంగామా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవాలని చూస్తున్నాడట.. దాని తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ అనౌన్స్ చేసి విధంగా దేవిశ్రీప్రసాద్ ప్లాన్ చేసుకున్నారట, దీంతో మరోసారి దేవిశ్రీప్రసాద్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.