BRO Collection : జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా రిలీజ్ అయిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదరగొట్టాయి. ముఖ్యంగా ఈ సినిమాకి అన్ని రకాలుగా బలం కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ ( BRO fourth day collection ) కనిపించిన తీరు, ఆయిన పాత సినిమాల పాటలు పంచ్ డైలాగులు ఇవన్నీ అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సామాన్య సినీ అభిమానులకు కూడా డైలాగ్స్ ఐతే మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించి, స్క్రీన్ ప్లే చేసి మంచి లుక్ తీసుకొచ్చాడు.
సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. తమిళ్ లో సూపర్ హిట్ అయింది దాన్ని తెలుగులో బ్రో సినిమాగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందించడం జరిగింది. ఈ సినిమా తమిళ్ లో పవన్ కళ్యాణ్ పాత్రని సముద్రఖని ( BRO fourth day collection ) నటించడం జరిగింది. కాబట్టి అతనికి ఈ సినిమాపై బాగా పట్టు ఉండడంతో ఈ సినిమాని తెలుగులో.. తెలుగు వారికి నచ్చినట్టుగా త్రివిక్రమ్ ఆధ్వర్యంలో సినిమాని సాధ్యమైనంత వరకు బాగానే తీశారు. అయినప్పటికీ సామాన్య సినీ అభిమానులకి పెద్ద హిట్టుగా అనిపించలేదు. సెకండ్ ఆఫ్ చాలా ల్యాగ్ గా లాగుతున్నట్టు సినిమాలో ఏదో మిస్ అయినట్టు అనిపించింది. కానీ ప్రతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంది.విపరీతంగా ఎంజాయ్ చేస్తూ.. చాన్నాళ్ళ తర్వాత వాళ్ళు చూశారు.
ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలు గత కొంత కాలంగా కొన్ని చాలా ఫ్లాప్స్ అవ్వడం వలన.. వాటితో వాళ్లు చాలా నిరాశలో ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ( BRO fourth day collection ) సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలో పెట్టి.. దానికి తోడు పవన్ కళ్యాణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపించి అభిమానుల మనసులు మాత్రం చాలా గట్టిగానే దోచుకున్నారు. అందుకే వాళ్ళు వాళ్ళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తిరుగులేదని.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. సినిమా కలెక్షన్స్ కూడా శుక్ర, శని, ఆదివారాలు బాగానే వచ్చాయి. విపరీతమైన భారీ కలెక్షన్స్ తో సినిమా మంచి టాక్ లో వచ్చింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 80.50 బిజినెస్ అయింది. ఇక కర్ణాటక ప్లస్ మిగిలిన ఇండియాలో 5 కోట్లు అవ్వగా.. ఓవర్సీస్ లో 12 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 97.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
ఈ సినిమా మొదటిరోజు 30.05 కోట్లు దాకా రెండవ రోజు 17.05 కోట్లు రాగా, మూడవరోజు 16.09 కోట్లు రాగా, నాలుగో రోజు మాత్రం విపరీతంగా తగ్గిపోయింది. నాలుగో రోజైన సోమవారం నాడు ఉదయం 17.6% , మధ్యాహ్నం 22.31% , సాయంత్రం 27.34% థియేటర్లో ఆక్యుపై నమోదయ్యాయి. కానీ నాలుగో రోజు కలెక్షన్ 7 కోట్ల వరకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియడం లేదు.. మూడు రోజులు అంత భారీగా వచ్చిన కలెక్షన్స్ నాలుగో రోజు అంత తగ్గుతదనే నమ్మశక్యంగా లేదు. మామూలుగా సాయిధరమ్ తేజ్ సినిమాకు అయితే లెక్క వేసుకోక్కర్లేదు గాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి నాలుగో రోజు కలెక్షన్ అంటే తక్కువే అని అంటున్నారు. అసలు ఇందులో ఇది అసలు నిజమేనా? అబద్ధమా? అని కూడా కొందరికి అనుమానంగా ఉంది ఇప్పటివరకు కలెక్షన్స్ అయితే మాత్రం బాగానే వచ్చాయని అనుకుంటున్నారు..