Details about Rajamouli hard work for Oskar Award: రాజమౌళి ఈరోజు యావత్ ప్రపంచానికి తెలిసిన గొప్ప వ్యక్తి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు గర్వాంగా తల ఎత్తుకునేలా చేసిన రాజమౌళిని తెలుగువారందరూ కొనియాడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా నాటు నాటు పాటతో ప్రపంచంలో ఎంతో విలువైన అవార్డు ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సొంతం చెయ్యడమే కాకుండా. నందమూరి, మెగా కుటుంబాలకు ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి సృష్టించిన రికార్డ్ ఇంకెవ్వరూ సృష్టించలేరు అనుకున్నారు. కానీ ఆ రికార్డ్ ని ఆస్కార్ లెవెల్ లో మళ్ళి రాజమౌళినే కొడతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుని దేశంలో ప్రతీ ఒక్కరూ పొగిడేలా చేసుకున్నాడు రాజమౌళి.
ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఎందరిదో పార్ట్ అందులో ఉంటాదని తెలుసు గాని, అందరిని తనకు తగ్గట్టు మలుచుకుని పని చేయించుకోవడంలో, అఖండ విజయం సాధించడంలో రాజమౌళి ( Details about Rajamouli hard work for Oskar Award )అసలైన హీరో. అసలు ఆస్కార్ అవార్డు సంగతి పక్కన పెడితే, ఆస్కార్ కి నామినేట్ అవ్వడం కూడా చాలా కష్టంతో కూడిన పని. ఆర్ఆర్ఆర్(RRR) చిత్రానికి ఇండియా నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ రాలేదు. కానీ రాజమౌళి మాత్రం పట్టుదలతో, తన సినిమా మీద తనకున్న నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. తాను ఒక్కడూ మాత్రమే వెళ్లకుండా టీం మొత్తాన్ని నడిపించాడు. వరల్డ్ వైడ్ ఆస్కార్ జ్యూరీ సభ్యులు వేలల్లో ఉండగా, వారందరి ఓటింగ్ తోనే ఆస్కార్ నామినేషన్ కి సెలెక్ట్ అవుతారు.
ఆస్కార్ అవార్డు వరకు వెళ్లడం చాలా కష్టమని ఎంతమంది చెప్పినా, రాజమౌళి రాజీ పడకుండా ఫలితం ఎలా ఉన్నా.. ప్రయత్న లోపం ఉండకూడదు అనే సిద్దాంతంతో ముందుకు వెళ్లి.. భారతదేశాన్ని మీసం మెలేసేలా చేసాడు మన జక్కన్న. సినిమాలో ఆర్టిస్ట్స్ ని తనకి కావలసినట్టు చెక్కుతాడనే రాజమౌళి కి జక్కన్న అనే పేరు వచ్చింది. కానీ నటులను మాత్రమే కాదు, తెలుసు సినిమా ఇండస్ట్రీనే తనకు కావలసినట్టు మలుచుకున్నాడు మన జక్కన్న . అమెరికాలో ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ చాలా భారీ స్థాయిలో చెసాడు రాజమౌళి. అక్కడకు ముందుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పంపి.. మీడియాకి అట్రాక్ట్ అయ్యేలా.. అన్ని మాద్యాలను వాడి చాలా గట్టి ప్రమోషన్ చేసాడు. దీనికి అయిన మొత్తం ఖర్చు రాజమౌళి మాత్రమే భరించాడంట.
వీటన్నిటికీ కొన్ని కోట్లలో ఖర్చు అయ్యిందంట. ఆఖరికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఖర్చులు కూడా మొత్తం రాజమౌళినే భరించాడంట. ఆర్ఆర్ఆర్ సినిమాకి రాజమౌళి తీసుకున్న మొత్తం రెమ్యునిరేషన్ మాత్రమే కాకూండా ఇంకా చాలా ఖర్చు పెట్టాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజం అయితే.. తన నమ్మకంతో ముందుకు వెళ్లినందుకు ఇంత గొప్ప ఫలితాన్ని అందరూ అనుభవిస్తుంటే.. కోట్లలో నష్టం మాత్రం రాజమౌళి ఒక్కడికే అంటే ఘోరమే. ఆ ఖర్చుని హీరోలు ఇద్దరూ కూడా కొంత భరిస్తే బాగుంటుంది మరి. ఎందుకంటే ఈ చరిత్ర సృష్టించిన రికార్డ్ లో వాళ్లిద్దరూ కూడా ఉంటారు కాబట్టి..