Srikanth Odhela: మార్చ్ 30ని విడుదల అయిన దసరా సినిమాకి టాక్ బాగానే వచ్చింది. ఈ సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే నానిని ఒక కొత్త కోణంలో చూపించడమే కాకుండా.. సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరించడం. ఈ సినిమా దర్శకుడు ( Dasara movie director Srikanth Odhela first love details ) మొదటి సినిమా అయినప్పటికీ, అలాంటి ఫీల్ ని ఎక్కడా తీసుకు రాకపోవడం ఒక గొప్ప విశేషం. ఈ సినిమాతో నానికి మాత్రం మంచి క్రేజ్ పెరిగింది. కీర్తి సురేష్ కూడా చాలా అద్భుతంగా నటించింది కానీ, ఆమె ఆల్రెడీ మహానటి సినిమాతో తన ప్రతిభ చూపించేయడంతో..
ఈ సినిమాలో కూడా చాలా బాగా చేసింది అనిపించుకుంది గానీ ఏదో కొత్త కోణాన్ని చూపించినట్టు అనిపించలేదు. అలాగే ఈ సినిమా మొదటి ఆఫ్ మంచి స్పీడ్ గా వెల్తూ.. సెకండ్ ఆఫ్ మాత్రం చాలా స్లో అయ్యింది. ఇకపోతే ఏ కథ రాసుకున్నా, ఎవరు రాసినా అందులో ఏదో ఒక స్ఫూర్తి అనేది ఉంటాది. అది కూడా మన జీవితంలో మన చుట్టూ జరిగిన వాటిని బట్టి కలుగుతాది. అలాగే ఈ సినిమా దర్శకుడు ( Dasara movie director Srikanth Odhela first love details ) శ్రీకాంత్ కి కూడా కలిగిందంట. తాను ఫస్ట్ టైం ఒక స్త్రీ ని చూసి ఆకర్షితుడు అయ్యాడంట.
పైగా ఊరుపేరు తెలియని ఆమెను చూసి ఇష్టపడ్డాటంట. అలా ఆమెకు ఆకర్షితుడు అయ్యి, రోజు ఆమె వైపే చూడాలని అనిపించేదంట. అసలు సంగతి ఏమిటంటే.. దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిన్నప్పుడు వాళ్ళ తాత కళ్ళకి దెబ్బ తగిలిందంట. కాలికి దెబ్బ తగలటంతో వాళ్ళ తాత కదల్లేని స్థితికి వచ్చాడంట. దానితో అతను రోజు కల్లు తాగటం అలవాటు కనుక అది కొని తీసుకురమ్మని శ్రీకాంత్ ని కల్లు దుకాణానికి పంపేవాడంట. తాత మాటకు ఎదురు చెప్పలేక శ్రీకాంత్ కల్లు దుకాణానికి వెళ్ళాడంట.
అక్కడ సిల్క్ స్మిత పోస్టర్ ఫస్ట్ టైం చూసాడంట. ఆమె పేరు గాని, ఊరుగాని, అసలు ఆమె ఒక నటి అని గాని ఏమి తెలియదంట. కానీ ఆమె మాత్రం చాలా నచ్చిందట. అప్పటి నుంచి తాతకు కల్లు తెచ్చే వంకతో ఆ దుకాణానికి వెళ్లి ఎక్కువసేపు అలా ఆ స్మిత ఫోటో ని చూస్తూ ఉండేవాడట. అలా సిల్క్ స్మితని మొదట లవ్ చెయ్యడమే కాకుండా, తన మొదటి సినిమాలో మొదట స్టోరీ బిగినింగ్ నుంచి చివరికి సినిమా ఎండింగ్ వరకు సిల్క్ స్మిత పోస్టర్ కి, ఆమె పేరున ఉన్న మందు కొట్టుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు శ్రీకాంత్ పాపం ఫస్ట్ లవ్ కోసం..