Home Cinema Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

daggubati-rana-comments-on-rumours-of-an-affair-with-that-heroine

Daggubati Rana : రామానాయుడు కుటుంబం నుంచి వెంకటేష్ తర్వాత దగ్గుబాటి రానా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి.. తాత, బాబాయ్, తండ్రి ఇలా ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని నటుడిగా మాత్రమే ( Daggubati Rana comments on rumours ) కాకుండా.. నిర్మాతగా కూడా ముందుకు సాగుతున్న రానా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రానా హీరోగా ప్రయత్నించి కేవలం హీరో పాత్రలకు మాత్రమే అంకితం కాకుండా.. తన ట్యాలెంట్ కి ఎటువంటి ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని అందుకుని.. ఎప్పుడు ఆడియన్స్లో మంచి నటుడిగా.. వాళ్లకి గుర్తుండే విధంగా.. టచ్ లోనే ఉంటున్న తెలివైన నటుడని చెప్పుకోవచ్చు.

Rana-daggubati-comments-on-rumours

బాహుబలి సినిమాలోని బల్లాల దేవా గా రానా ప్రదర్శించిన నటనాప్రతిభ మామూలు విషయం కాదు. రానా పర్సనాలిటీని, నటన ప్రతిభని చక్కటి పాత్ర కోసం వాడుకున్న తెలివైన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రభాస్కి ( Daggubati Rana comments on rumours ) ఎంత పేరు వచ్చిందో బల్లాలదేవగా రానాకి కూడా అంతే పేరు వచ్చింది. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనే ఫీలింగ్ ని కలిగించేలా నటించాడు రానా. అలాగే భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ అనే పాత్రను కూడా అద్భుతంగా చేసాడు. రానాకి ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇమిడిపోవడం అనేది అతనిలో ఉన్న సహజ తత్వం.

See also  Ram Charan - Upasana : ఏ మగాడికి ఇలాంటి టార్చర్ వద్దంటూ.. ఉపాసన గురించి ఆశక్తికరమైన విషయం బయటపెట్టిన రామ్ చరణ్!

Rana-comments-on-rumours-that-heroine

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో నటించే వాళ్లపై ఎప్పుడూ ఏవో ఒక రూమర్సు వస్తూనే ఉంటాయి. అలాగే రానా పై కూడా అనేక రూమర్స్ రావడం జరిగింది. రానాకి శ్రియాతో ఎఫైర్ ఉందని చాలాకాలం రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత త్రిష తో ఉందని రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ రూమర్సే అని తర్వాత నిరూపణ అయ్యాయి. ఇవన్నీ ( Daggubati Rana comments on rumours ) పక్కన పెడితే రానాకి బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుతో కూడా అఫైర్ ఉందని అప్పట్లో తెగ రూమర్లు వచ్చాయి. రానా బాలీవుడ్ లో దమ్ మారో ధమ్ అనే సినిమాలో నటించడం జరిగింది. ఆ సినిమాలో నటించేటప్పుడు బిపాషా బాసుతో రానాకు స్నేహం కుదిరిందని, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన అఫైర్ నడుస్తుందని వార్తలు వచ్చేవి.

See also  Vijay samantha: ఖుషి చిత్రంలో నిజంగానే సామ్-విజయ్ లు లిప్ లాక్ లు పెట్టేసుకున్నారా.? పై గా ఆ పని కూడా..

Rana-comments-on-rumours-affair

వార్తలను బలపరిచేలాగా ఒకసారి రానాతో కలిసి బిపాషా బాసు హైదరాబాద్ రావడం జరిగింది. అది చూసి ఇంకా బాగా ఫిక్స్ అయిపోయారు మీడియా వాళ్ళు, ప్రజలు. అయితే అప్పట్లోనే రానా అందరికీ క్లారిటీ ఇచ్చాడు. బిపాషా బాసు నాకు మంచి ఫ్రెండ్ అంతే తప్పా.. మా ఇద్దరి మధ్యన ఎలాంటి అఫైర్స్ లేవు. మీరు అనుకున్నట్టు ఎలాంటి చెడు ఫ్రెండ్షిప్ మా మధ్యన లేదు. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. మేమిద్దరమే కాదు.. నేను ఇంకా బాలీవుడ్ లో నటించిన దమ్ మారో ధమ్ సినిమా టీం వాళ్లతో చాలా మందితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. మేమందరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నాం. అంతే తప్ప ఎలాంటి చెడు లేదు. అలాంటిదేమైనా ఉంటే నేను దాచను.. కానీ మా మధ్య అలండి ఏమి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలం ఈ సంగతిని చాలా వరకు పక్కన పెట్టినా కూడా.. ఇంకా ఇప్పటికీ కొందరు అప్పుడప్పును ఈ అనుమానాన్ని హల్చల్ చేస్తూనే ఉంటారు.