Sameera Reddy: సినిమా ఇండస్ట్రీ చాలా విచిత్రమైనది. కొంతమంది హీరోయిన్లు ఇలా వచ్చి.. అలా కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయి.. అనేక సంచలనాన్ని సృష్టించి.. స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతూ.. అందరి హృదయాల్లో వాళ్లకు ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. మరి కొంతమంది హీరోయిన్స్ ఇలా ( Sameera Reddy’s marriage and her pregnancy ) వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోతారు. అయినా కూడా ఒక్కసారి సినిమా రంగంలో అడుగుపెట్టి నటించిన తర్వాత.. వాళ్లకి పూర్తిగా వదలబుద్ధి కాదు.. అలాగే అభిమానులు కూడా పూర్తిగా వారిని వదిలేయరు.
ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఈ నటీనటులు అభిమానుల మధ్య కలయిక అనేది తప్పదు. అది ముఖ్యంగా మీడియా ద్వారా వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకప్పటి ఎన్టీఆర్ లవర్ గా ఇండస్ట్రీలో పేరుగాంచిన సమీరా రెడ్డి ( Sameera Reddy’s marriage and her pregnancy ) గురించి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె తెలుగు సినిమాల్లో జై చిరంజీవ, అశోక్, నరసింహుడు వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈమెకు పెద్దగా ఆఫర్లు దొరకలేదు. అక్కడ నుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా వెళ్లిపోయింది. ఇంతవరకే అందరికీ బాగా తెలుసు.
అప్పట్లో సమీరా రెడ్డి ఎన్టీఆర్ మధ్యన ఎఫైర్ ఉందని అనేక రూమర్స్ వచ్చాయి. అప్పుడు హరికృష్ణ .. ఎన్టీఆర్ ని జాగ్రత్తగా సమీరా రెడ్డి నుండి కాపాడుకున్నారని అంటారు. ఈ రూమర్స్ అన్ని పక్కన పెడితే.. మరోపక్క ఇంకా దారుణమైన రూమర్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే సమీరా రెడ్డి తన స్నేహితుడిని పెళ్లి చేసుకొని సెటిలైంది. ఆమె ( Sameera Reddy‘s marriage and her pregnancy ) స్నేహితుడిని ప్రేమించిన విషయం ఇంట్లో వాళ్లకు చెప్పింది. వాళ్ళు ఒప్పుకోవడంతో సింపుల్ గా వాళ్ళింటి టెర్రస్ పైన పెళ్లి చేసుకున్నారు అంట..దీంతో సమీరా రెడ్డి సౌండ్ లేకుండా పెళ్లి చేసేసుకుందని.. దానికి కారణం సమీరా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అని.. అందుకే ఆమె తొందరగా ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలని చేసేసుకుందని.. వార్తలు వచ్చాయి.
ఈ విషయం ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెబుతూ.. అలాంటి రూమర్స్ చూసి కొన్ని రోజులు చాలా నవ్వుకున్నాను.. ఆ తర్వాత ఇంక పట్టించుకోవడం మానేశాను అని చెప్పింది. అలాగే పెళ్లి తర్వాత తను విపరీతంగా వెయిట్ పెరిగిపోయిందని.. అసలు ఆపలేకపోయాను అని.. అందుకే ఇంకెక్కడికి బయటకు కూడా ఎక్కువగా తిరగడం మానేశానని చెప్పింది. కాయగూరలు కొనడానికి బయటకు వస్తే.. వెజిటబుల్ వాడు కూడా అమ్మా ఎందుకు ఇంత వెయిట్ పెరిగిపోతున్నారు అని అడిగాడని చెప్పుకొచ్చింది. ఇలా సమీరారెడ్డి పై వచ్చిన రూమర్స్ ని ఆమె గుర్తు చేసుకుంటూ నవ్వుకుంది..