Comments on Samantha marriage in social media: సమంత అంటే ఎందరో సినీ అభిమానులకు నచ్చుతాది. అలాగే ఆమె అభిమానులు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. సమంత కెరియర్ లో ఎంతో నైపుణ్యంగా, జాగ్రత్తగా మంచి కథలు నటిస్తూ.. దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అంతేకాదు సమంత అంటే లక్కీ హీరోయిన్ అని పేరు కూడా తెచ్చుకుంది. ప్రొఫిషనల్ గా ఎంతో విజయాన్ని సాధించిన సమంత పర్సనల్ లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తన పర్సనల్ లైఫ్ నాగచైతన్యను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట ను చూస్తే, అందరికి నచ్చుతాది. ఇంచుమించుగా ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న చైతు సమంతలు చివరికి ఇంట్లోవాళ్ళని ఒప్పించి 2017 లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి ఎంతో ఘనంగా, అందరికి కన్నుల విందుగా జరిగింది.
కొంతకాలంగా ప్రేమించుకుని, ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళిలో, సమంత చైతు జంటకు సోషల్ మీడియాలో అందరూ కూడా బాగా విషెస్ చెప్పారు. పెళ్లి తరవాత కూడా ఈ చైతు సమంత కలిసి నటించిన మజిలీ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో తన భర్తతో ఎంతో సహనంగా నటించే భార్యగా సమంత, చివరికి తన భార్య ప్రేమ విలువ తెలుసుకున్న భర్తగా చైతు చాలా బాగా నటించారు. కానీ నిజ జీవితంలో వీళ్ళిద్దరూ అంత సహనంగా జీవితాన్ని కలిసి సాగించలేకపోయారు. పెళ్లి అయిన నాలుగేళ్లు కూడా కలిసి జీవించలేక, కనీసం ఒక సంతానం కలిగే వరకు కలిసి ఉండలేకపోయారు. అయితే వీళ్లద్దరూ విడిపోవడం అభిమానులకు మాత్రం అస్సలు నచ్చలేదు.
చైతు సమంతలు మళ్ళి కలిస్తే బాగుణ్ణు అని, కలవాలని మనస్ఫూర్తిగా అభిమానులు కోరుకున్నారు. కానీ కొద్దీ నెలల క్రితమే వీళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. దానితో అభిమానులు అందరికీ వాళ్ళ ఆశలు అడియాసలు అనే విషయం అర్ధమైపోయింది. విడాకులు తరవాత వీళ్ళిద్దరూ ఎవరి కెరియర్ బిజీలో వాళ్ళు ఉన్నారు. సమంత తో విడిపోయిన తరవాత నాగచైతన్య సినిమాలలో పెద్ద హిట్స్ లేవు. అయినా తన కెరియర్ తాను కష్టపడుతున్నాడు. అలాగే సమంత కూడా లైన్ గా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది. అయితే సమంతకు ( Comments on Samantha marriage in social media ) సంబంధించు ఒక వార్త బయటకు వచ్చి అది బాగా వైరల్ అవుతుంది. ఈ న్యూస్ చూడగానే, సమంత అంత పని చేస్తుందా అంటూ ఒక్కసారిగా ఆ న్యూస్ చదవటం పై పడతున్నారు.
ఇంతకీ అదేమిటంటే, విడాకులు తరవాత పెళ్లి చేసుకుంటున్న సమంత అంటూ వార్తలు వస్తున్నాయి. పైగా సమంత పెళ్లి చేసుకోబవుతున్నది , ఎవర్నో కాదు.. విజయ్ దీవరకొండని అని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సమంత, విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా నటిస్తున్న సంగతి మనకు తెలిసినదే. ఈ సినిమాలో సమంత పెళ్లి అయిన ఇల్లాలిగా కనిపిస్తాదట. విజయ్ దేవరకొండ-సమంత మధ్య పెళ్లి సీన్ కూడా ఉంటుందని సమాచారం. మొత్తానికి సమంత రియల్ లైఫ్ లో విడాకుల తర్వాత రీల్ లైఫ్ లో పెళ్లి పీటలెక్కుతోందని నెటిజనులు అనుకుంటున్నారు.