Comments on Rashmi about her decisions: రష్మీ గురించి తెలియని వారు ఉండరు. రష్మీ మొదట సిమిమాలలో హీరోయిన్ గా ఎదగాలని ఎంటర్ అయ్యింది. కానీ ఆమెకు సినిమాల్లో హీరోయిన్ గా ఎదగడానికి పెద్దగా అవకాశాలు రాలేదు.నటించిన సినిమాలు కూడా హిట్ కాలేదు. ఇలా ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలనే ఆశతో వచ్చిన ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి. అలా అని తాను అనుకున్నట్టు హీరోయిన్ అవ్వలేదు కాబట్టి, నిరాశతో నిశ్శబ్దంగా ఊరుకునిపోవాలని రష్మీ అనుకోలేదు. తనదైన శైలిలో యాంకర్ గా లైఫ్ లో ఇంకో ఛాన్స్ కోసం ట్రై చేసి ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గా అవకాశము దక్కించుకుని తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గర అయ్యింది. ఎప్పుడైతే ఆ షో లో ఎంటర్ అయ్యిందో, అప్పటి నుంచి రష్మీ యాంకర్ గా మంచి స్పీడ్ అందుకుంది. పాపులారిటీ బాగా పెంచుకుంది.
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాదో ఎవ్వరికీ తెలీదు. ప్రతీ ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక రంగంలో పలానా పోజీషన్ కి వెళ్లాలని అనుకుంటారు. కానీ అందరూ అనుకున్నట్టు అనుకున్న స్థానం సంపాదించుకోకపోవచ్చు. కానీ మనలో ఉన్న ఇంటరెస్ట్, ట్యాలంట్ కి దేనికైతే మనం ట్రై చేసామో దాని రిలేటెడ్ దానిలో ఖచ్చితంగా మంచి స్థానం సంపాదించవచ్చు. అలానే రష్మీ కూడా హీరోయిన్ కాకపోయినా, ఆడియన్స్ కి అందుబాటులో ఉండే మంచి యాంకర్ అయ్యింది. జబ్బర్దస్థ్ షో ఎప్పుడైతే అంత పెద్ద సక్సెస్ ని అందుకుందో.. అక్కడ నుంచి రష్మీ కి టీవీ షోస్ లో మంచి మంచి అనేక అవకాశాలు తన్నుకుని వచ్చాయి. అందుకే మనమాశించింది జరగకపోయాయినా కృంగిపోకుండా, ఏ అవకాశాము దొరికితే అందులో సక్సెస్ అవ్వడానికి ట్రై చెయ్యాలి.
రష్మీకి ( Comments on Rashmi about her decisions ) జంతువులు అంటే చాలా ఇష్టం. రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాది. తాను పోస్ట్ చేసే పోస్ట్స్ కి నెటిజనులు చాలా బాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో అందరికీ రష్మీ కి జంతు ప్రీతీ చాలా ఎక్కువని తెలుసు. ఆమెపై ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా, అది పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైనా కూడా చాలా సహనంగా అందరికీ సమాధానం ఇస్తూ వస్తాది. ఇటీవల అంబర్ పేట వీధికుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి విషయంలో రష్మిని బాగా ఆడుకున్నారు నెటిజనులు. పాపం ఈ సంఘటనకి రష్మీకి సంబంధం లేదు కానీ, ఆమెకి జంతు ప్రీతీ ఎక్కువగా ఉండటం వలన ఆమెతో నెటిజనులు ఆడుకున్నారు. ఆ కుర్రాడి మృతి ఫోటోలని పెట్టి మరీ రష్మీ ని ఏకిపారేశారు.
రష్మీ కొన్ని ప్రొడక్ట్స్ కి ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటాది. అయితే ఇటీవల తాను పాల ఉత్పత్తుల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యనని చెప్పింది. దానికి ఒక నెటిజనుడు.. రష్మీ 2019 లో ఓ ఐస్ క్రీమ్ షాప్ ను ఓపెన్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజనులు, డబ్బులు కోసం ఏమైనా చేస్తారు గాని, తరవాత ఇలాంటి కబుర్లు చెబుతారు అంటూ ఏకడం మొదలు పెట్టారు. దానికి రష్మీ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అవును డబ్బు కోసమే అప్పుడు ఓపెనింగ్ కి వెళ్లాను. అప్పుడు తెలీక తప్పు చేసాను, కానీ నేను కొన్నేళ్ల నుంచి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేశాను. వాటిని వాడటం వల్ల నా స్కిన్ అనారోగ్యానికి గురయ్యింది. అప్పటినుంచి పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలలో వాటి తయారీ విధానం తెలుసుకుని, పూర్తిగా పాల ఉత్పత్తులకు ప్రమోట్ చేయడం మానేశాను`. అప్పుడు తెలీక తప్పు చేసానని, ఇపుడు తెలిసినా కూడా తప్పు చెయ్యను. అది నాఇష్టం అంటూ రష్మీ నెటిజలుకు ఘాటుగానే సమాధానం చెప్పింది.