Home Cinema Pushpa 2 trailer: పుష్ప 2 ట్రైలర్ చూస్తే.. మీకు కూడా సుకుమార్ అలా ఆలోచించాడనిపిస్తుందా?

Pushpa 2 trailer: పుష్ప 2 ట్రైలర్ చూస్తే.. మీకు కూడా సుకుమార్ అలా ఆలోచించాడనిపిస్తుందా?

Pushpa 2 trailer: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చాలా పెద్ద హిట్ అయ్యిందన్న సంగతి మనకు తెలిసందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక కొత్త గెటప్ తో అందరినీ అలరించాడు. సినిమాలో పెద్ద కథ లేకపోయినా కూడా .. కేవలం అల్లు అర్జున్ అద్భుతమైన ( Comments on Pushpa 2 trailer ) నటనతో సినిమాని గట్టిగా నిలబెట్టాడు. ఇక సుకుమార్ ట్యాలెంట్ కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేదు. హీరో క్యారక్టర్ ని ఒక రకంగా ఫిక్స్ అవుతాడు. ఇక అంతే దానిమీదనే ఫోకస్ మొత్తం పెట్టి.. ఆ హీరో ని ఆ క్యారెక్టర్ లో ఎక్కువ కాలం గొప్పగా గుర్తుంచుకునేలా చేస్తాడు.

comments-on-pushpa-2-trailer

అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పాన్ ఇండియా సినిమా, పార్ట్ 2 లేదా 3 వరకు కూడా సినిమాలు తియ్యడం నడుస్తుంది. పుష్ప సినిమా కూడా అలానే పార్ట్ 2 కి వెళ్లారు. అయితే పార్ట్ వన్ లో పుష్ప పూర్తిగా స్మగ్లింగ్ చేసే హీరో. కేవలం హీరోయిజం తప్ప.. ఇంకేమి సినిమాలో చూపించలేదు. అయినా సినిమా స్క్రీన్ ప్లే, సాంగ్స్, హీరో, హీరోయిన్ అందరూ.. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాని అంత హైప్ లో నిలబెట్టాడు. ఈరోజు పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో మొదట పుష్ప ని అడవుల్లో పోలీసులు పుష్పా పై కాల్పులు జరపగా.. బులెట్ దెబ్బలతో తప్పించుకున్నాడు అని స్టార్ట్ అవుతాది.

See also  Rashmi Gautam: యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోయేది రెండో పెళ్లి చేసుకున్న వాడితో నా.??

comments-on-pushpa-2-trailer

అక్కడ నుంచి పుష్పా దొరకడం లేదని, అసలు పుష్ప బ్రతికి ఉండి ఉంటాడని నమ్మకం లేదని వార్తలు వస్తూ ఉంటాయి. దానితో పుష్ప అభిమానులు రెచ్చిపోయి అల్లరులు, కాల్పులు చేస్తారు. లాస్ట్ కి పుష్ప అడవిలో పులితో ఉన్నట్టు ఒక వీడియో కనిపించడంతో అందరూ అమ్మయ్య పుష్ప బ్రతికే ఉన్నాడు అనుకుంటారు. ” అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేస్తే.. పులి వచ్చినట్టు. మరి పులి రెండడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చినట్టు అనే డైలాగ్ హైలెట్ గా ఉంది. అయితే ఈ ట్రైలర్ ( Comments on Pushpa 2 trailer ) చూస్తే కొన్ని సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.

See also  Oscar Award: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఉపాసనకు ఏమిచ్చాడో తెలుసా?

అగ్నిపర్వతం, జంటిల్ మాన్, కిక్, కెజిఎఫ్ ఇలా ఇప్పటికి అనేక సినిమాలలో హీరో దొంగతనం చేసిన డబ్బుని, పేద ప్రజల కోసం వాడతాడు. కాకపోతే ఒక్కొక్క సినిమాలో ఒకొక్క వర్గానికి ఖర్చుపెడతున్నట్టు చూపిస్తారు. అలా చాలా సినిమాలు వచ్చాయి అనుకోండి, అయితే పుష్ప సంగతికి వస్తే.. పుష్ప సినిమా హిట్ అయితే అయ్యింది కానీ, అసలు ఒక స్మగ్లింగ్ చేసుకునే వాడి మీద హీరోయిజం సినిమా ఏమిటని క్రిటిక్స్ చాలా వచ్చాయి. అయితే వాటన్నిటికి సమాధాణంగా సుకుమార్ పుష్పని సామాన్య ప్రజలకు దేవుడిలా చూపించబోతున్నాడు.

See also  Vijay Devarakonda : తన రెమ్యూనరేషన్ నుండి కోటి రూపాయిలు వారికి ఇవ్వనున్న విజయ్ దేవారకొండ..

comments-on-pushpa-2-trailer

మొదటి పార్ట్ లో ఓన్లీ హీరోని హైలెట్ చేస్తే, రెండవ పార్ట్ లో హీరోయిజాన్ని హైలెట్ చెయ్యడం ట్రెండ్ అయ్యింది. కెజిఎఫ్ లో కూడా మొదటి పార్ట్ హీరో స్టైల్, యాక్షన్ బాగా చూపించి హీరోని బాగా హైలెట్ చేసేసారు. రెండవ పార్ట్ లో హీరో వెనుక ఎంతమంది ఉన్నారు, హీరో గొప్పతనం, గొప్పమనసు అన్నీ కలిపి హీరోయిజాన్ని చూపించారు. అంతేకాదు సుకుమార్ ఈ సినిమాని ఇంకొక కోణంలోకి తీసుకుని వెళ్ళాడు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలంటే.. మాఫియా గ్యాంగ్ కి పుష్ప పెద్ద లీడర్ లా, అనేక దేశాలు తిరుగుతూ.. ఇతర దేశాల కల్చర్ కూడా చూపిస్తూ.. ఇండియా మొత్తం లో అల్లర్లు, అలజడులు చూపిస్తూ ప్రపంచ వవ్యాప్తంగా సినిమా బిజినెస్ కోసం ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.