Comments on Niharika and Naga Shourya: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ కి ఉన్న స్థానం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఒకే జనరేషన్ లో అంతమంది హీరోలు ఉండటం అంటే స్పెషల్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ ఫామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా కూడా, తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ కుటుంబం నుంచి, సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి హీరోయిన్ నాగబాబు కూతురు నిహారిక. మెగా ఫ్యామిలీ కాదు, మెగా అభిమానులకు కూడా నిహారికా అంటే చాలా అభిమానం, ఇష్టం. ఒక మనసు సినిమాతో నిహారికా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. ఆ సినిమాలో ప్రేక్షకులకు కొంచెం బాగానే దగ్గర అయ్యింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నటించింది కానీ, ఎలాంటి పేరు తీసుకుని రాలేదు.
సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా నిహారికా ఎదిగే సూచన పెద్దగా కనిపించలేదు. దీనితో నిహారికాకీ పెళ్లి చేసేసారు. జొన్నలగడ్డ చైతన్య నిహారికా పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అయితే నిహారికా పెళ్లికి ముందు, ఒక మనసు సినిమా చేసిన తరవాత నిహారిక హీరో నాగసౌర్యాని ప్రేమిస్తుంది అంటూ గాలి వార్తలు వచ్చేవి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఎందుకంటే నిహారికా నాగసౌర్య కలిసి నటించిన సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. పైగా అందులో నిహారికానే నాగసౌర్య ను ఎక్కువగా ప్రేమించే క్యారక్టర్. హీరో ప్రేమలో బాగా మునిగిన హీరోయిన్ కి అందులో తన కెరియర్ గాని, తన జీవితం గాని, ఆమె తల్లి గాని, ఆమె పరువు గాని ఏది ఎక్కువగా అనిపించదు. అంతగా ఆ సినిమాలో నిహారిక నాగసౌర్య ని ప్రేమించే క్యారక్టర్ చేసింది.
పాత్రలో నిహారికా ఎంత బాగా మునిగి నటించిందో, ప్రేక్షకులు కూడా అంత బాగా అందులో లీనం అయిపోయారు. అందుకే నిహారిక, నాగసౌర్యల మధ్య లవ్ నడుస్తుందని భావించేవారు. దాని వలన అనేక గాలి వార్తలు వచ్చి అప్పట్లో ఈ వార్త వైరల్ గా మారింది. కానీ నిజానికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు ఎక్కడ ఒక్క సాక్ష్యం కూడా లేదు, అలాగే వాళ్ళయిద్దరిలో ఎవ్వరూ ఎలాంటి మాట చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్య అలాంటి ప్రేమ ( Comments on Niharika and Naga Shourya ) ఏమి లేవు కాబట్టే ఎవరికి వాళ్ళు వేరు వేరు పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అలా నిహారిక నాగసౌర్య ల లవ్ పై క్లారిటీ వచ్చింది. కానీ, ఇటీవల నిహారిక విడాకులు తీసుకుంటుంది అంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు నిహారికా, మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు.
నిహారిక పెళ్లి తరవాత సినిమాల్లో నటించడానికి వీలు లేదని చెప్పే, జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్నారని.. ఇప్పుడు నిహారిక మళ్ళీ ఏదో వెబ్ సీరీస్ లో చెయ్యడానికి ట్రై చేస్తుందని అంటున్నారు. అందువలనే చైతన్య నిహారికకు విడాకులు ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అఫిషియల్ గా ఎవరైనా చెబితే తప్ప నమ్మడానికి లేదు..