Home Cinema Allu Arjun : పరువు పోతుందన్నా కూడా అల్లు అర్జున్ అందుకోసమే ఆ పని చేస్తున్నాడా?

Allu Arjun : పరువు పోతుందన్నా కూడా అల్లు అర్జున్ అందుకోసమే ఆ పని చేస్తున్నాడా?

comments-on-allu-arjun-as-a-chief-guest-in-payal-rajputh-mangalavaram-movie-pre-release-event

Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తన మొదటి పాన్ ఇండియా సినిమాతోనే అల్లు అర్జున్ ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాని ఎవరు ఊహించనంత గ్రాండ్ సక్సెస్ చేసుకొని ( Allu Arjun and Mangalavaram movie ) సంచలనాన్ని క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటించిన తీరుని అమితాబచ్చన్ సైతం కొనియాడారు. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంతవరకు తెలుగు సినీ నటులు అందుకొని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా పుష్ప సినిమా నుంచి అందుకున్నాడు అల్లు అర్జున్.

Allu-Arjun-Mangalavaram-movie-event

ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మధ్యలో కొంత బ్రేక్ తీసుకొని ఇటీవలే జరిగిన మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లికి తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యి ఎంజాయ్ చేశాడు అల్లు అర్జున్. చాన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్ తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ముఖ్యంగా తన కొడుకుతో ( Allu Arjun and Mangalavaram movie ) ఆడుకుంటూ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి.. అల్లు అర్జున్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. వరుణ్ తేజ్ పెళ్లి అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ మళ్ళీ తన సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా దూరిపోవడం అందరికీ తెలిసిందే.

See also  Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

Allu-Arjun-Mangalavaram-movie

పుష్ప 2 సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని, గ్లోబల్ వైజ్ గా కూడా అల్లు అర్జున్కి మంచి ప్రాముఖ్యత పెరుగుతుందని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్న ఒక పని మీద అందరూ ఇదేం పని అని ( Allu Arjun and Mangalavaram movie ) ఆశ్చర్యపోతున్నారు. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మంగళవారం. ఈ సినిమా నవంబర్ 17వ తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 17 న రిలీజ్ చేసుకోబోతున్న ఈ సినిమాకి నవంబర్ 11వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెడీ చేస్తున్నారు చిత్ర బృందం వాళ్ళు.

See also  Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ కామెంట్ ఏమిటి?

Payal-rajput-mangalavaram

అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడు అని ఒక పోస్టర్ తయారు చేసే రిలీజ్ చేశారు. అది చూసి నిజంగా అల్లు అర్జున్ మంగళవారం సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ ఏమిటి అలాంటి అల్లు అర్జున్ ఇలాంటి సినిమాకి ప్రమోషన్ చేయడమేంటి? ఈ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా రావడం ఏమిటి అని అందరూ అంటున్నారు. దీనితో అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్కి అలాంటి బేధాలు ఉండవు. ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటాడు. అందుకే చిన్న చిన్న సినిమాలకు తన వంతు ప్రోత్సాహం ఇస్తున్నాడు. అంతే తప్ప దీనిలో తప్పేముంది అని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా ఒకవేళ చిన్న సినిమాలను ప్రమోట్ చేయాలనుకున్న ఆ సినిమాలో కొంచెం ఆదర్శవంతంగా ఉండాలి గాని.. ఇలాంటి సినిమాలు కి ప్రమోట్ చేయడం ఏంటి అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఎలాంటిది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కదా తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ నిజంగా ఈ ఈవెంట్ కి వస్తాడా? ఆ సినిమా హిట్ అవుతుందా ? ఏమవుతుందనేది చూడాలి..