Home Cinema Vasuki : రెంట్ కట్టటానికి డబ్బులు లేక తిరుపతి రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటున్న ఒకప్పటి...

Vasuki : రెంట్ కట్టటానికి డబ్బులు లేక తిరుపతి రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటున్న ఒకప్పటి స్టార్ కమెడియన్..

Vasuki : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ లో టాప్ స్థానం లో కొనసాగిన కొంతమంది నటీనటులు ఆ తర్వాత వృద్దాప్యం లో అవకాశాలు కోల్పోయి, ఆర్ధిక బాగా చితికిపోయి, రోడ్ల మీద పడి పొట్టకూటి కోసం బిక్షాటన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు(Vasuki Begging). వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తాది. ఇండస్ట్రీ లో ఎంతో మందితో పని చేసి ఉంటారు, కనీసం ఒక్కరికి కూడా ఇలాంటి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని సహపడాలని ఉండదు. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు ఇలాంటి వారిని గుర్తుపెట్టుకొని మరీ ఆర్ధిక సహాయం చేసారు.

See also  Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

comedian-vasuki-begging

అలాంటి వారిలో పావలా శ్యామల గారు ఒకరు, ఈమెకి చిరంజీవి ఆర్థికంగా చాలా సహాయం చేసాడు. కానీ ఈమె లాగానే మరో కమెడియన్ కూడా ఇలా ఆర్థికంగా కనీసం ఇంటి రెంట్ ని కూడా కట్టుకోలేనంత దీనమైన స్థితి లో ఉండడం తో, రోడ్డు మీద భిక్షాటన చేస్తూ కనిపించింది, ఆమె పేరే వాసుకి(Vasuki Begging). ఈమె తమిళం లో పెద్ద స్టార్ కమెడియన్, సుమారుగా 250 కి పైగా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు అవకాశాలు మరియు డబ్బులు లేక కనీసం ఇంటి రెంట్ ని కూడా కట్టుకోలేని పరిస్థితి లో ఉంది.

See also  Jr.NTR : లక్ష్మీప్రణతిని చంపేస్తానని ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో వార్ణింగ్ ఇచ్చాడో తెలుసా?

vasuki

తెలుగు లో ఈమె మోహన్ బాబు హీరో గా నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం లో నటించింది. ఇందులో ఆమె పోషించిన పాత్ర ఎప్పటికీ మరచిపోలేము, ఈ సినిమా తర్వాత ఆమె పెద్ద రాయుడు చిత్రం లో కూడా నటించింది. మోహన్ బాబు తో మంచి రిలేషన్ ఉంది, ఆయన కొడుకు మంచు విష్ణు ఇప్పుడు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు. అయినా కూడా ఈమెకి ఇప్పటి వరకు ఆర్ధిక సహాయం అందకపోవడం బాధాకరం. కనీసం ఇప్పటికైనా ఈమె బాధని అర్థం చేసుకొని, ఆమెకి పని ఇచ్చి ఉపాధి కల్పించడమో, లేకపోతే ఆర్ధిక సహాయం చెయ్యడమో చేస్తారని భావిస్తున్నాము.

See also  Amala Paul: జీవితం లో నన్ను అందరూ మోసగించారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అమలా పాల్..!

comedian-vasuki

అంతే తమిళ సినీ ఇండస్ట్రీ కూడా ఈమెని ఆదుకోవాలి. ఎందుకంటే అక్కడే ఈమె ఎక్కువగా సినిమాలు చేసింది, ఈమె ఇంత కష్టం లో ఉంది అని తెలిసి కూడా ఇప్పటి వరకు అక్కడ ఎవ్వరూ స్పందించకపోవడం బాధాకరం, ఇలా ఉంటే సినీ ఇండస్ట్రీ మీద, అందులో ఉన్న పెద్దల మీద ఉన్న గౌరవం మొత్తం పోతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.