చదువుకునే పిల్లలు, యువత ఎంత యాక్టీవ్ గా ఉంటె తల్లితండ్రులు అంత ఆనందిస్తారు. అలానే వాళ్ళ అలవాట్లు, ప్రవర్తన మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటాది. ఇప్పుడు యువత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ సరైన పద్దతిలో వాడకపోతే, నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వలన ఎక్కడెక్కడో ఉన్న వారితో పరిచయాలు అవుతూ ఉంటాయి. దాని వలన నలుగురితో ఎలా మాట్లాడాలి, మనకి తెలియని, ఉపయోగకరమైనవి ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెడితే పరవాలేదు. కానీ కొందరు తప్పుడు దారులలో వెళ్లి జీవితాన్ని కోల్పోతుంటారు.
సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో పరిచయం కారణంగా హర్షిత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హర్షిత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అదే అతని జీవితాన్ని ఇలా కాల్చేసింది. రోజు కాలేజీకి వెళ్లి చదువుకుని, ఇంటికి వచ్చే పిల్లాడు చివరికి శవంగా మారి, ఆ తల్లితండ్రులకు కడుపు కోతను ఇచ్చాడు. హర్షిత్ గత కొన్ని రోజులగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం లేని కొత్త అమ్మాయితో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ చాటింగ్ వలన తన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి వస్తాదని ఊహించలేకపోయాడు.
హర్షిత్ కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని ధర్మస్థల సమీపంలోని అశోక్ నగర్ లో బెల్తంగడి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు . ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని అమ్మాయితో చాటింగ్ మొదలు పెట్టి, ఆమె రెచ్చగొట్టడంతో నగ్నంగా వీడియోలో చాటింగ్ చేసాడంట. అది అవతలవాళ్ళు రికార్డు చేసి, డబ్బు ఇమ్మని, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అంత డబ్బు ఇవ్వలేక, పరువుపోతుందని భయంతో హర్షిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.