
Chiranjeevi : ఒక సామాన్యమైన కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడుతూ పైకి వచ్చిన హీరో మన మెగాస్టార్ చిరంజీవి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కొత్తల్లో ఏ చిన్న పాత్ర దొరికిన దాన్ని వదలకుండా.. పాత్ర దొరకడమే అదృష్టం అన్నట్టుగా ( Chiranjeevi wife Surekha important role ) ప్రతి దాన్ని పట్టుకుని.. అది సైడ్ ఆర్టిస్ట్ అయినా, విలన్ పాత్ర అయినా, దేనినైనా కూడా వదలకుండా దాన్ని పూర్తి చేసుకుని.. దాని ద్వారా నాలుగు రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా.. కృషి, పట్టుదల ఉన్న మనిషని గుర్తింపు తెచ్చుకుని.. తనదైన శైలిలో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. అసలు తెలుగు సినిమా రంగంలో ఫైట్స్ కి, డాన్స్ కి ఒక ట్రెండు క్రియేట్ చేసిన మహానుభావుడు చిరంజీవి.
అలాంటి చిరంజీవి ఈరోజు.. అప్పుడు ఒక్కడే వచ్చి ఈరోజు ఎందరో మెగా హీరోల్ని తన చుట్టూ పెట్టుకుని.. వాళ్ళందరికీ దైవం కంటే గొప్పగా గౌరవంగా కనిపించే వ్యక్తిగా నిలబడిన అదృష్ట జాతకుడు చిరంజీవి. అయితే ఆయన జీవితంలో ఈ స్థాయిలో నిలబడడానికి ఆయన ఎన్నో బంధాలను కూడా వదిలి.. ఇలా నిలబడడానికి ( Chiranjeevi wife Surekha important role ) కారణం ఒక స్త్రీ.. పైగా ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని ప్రముఖ సినీ జర్నలిస్టు సినీ విశ్లేషకుడు ఈమంది రామారావు చెప్పారు. ఇంతకీ చిరంజీవి గురించి ఆయన జీవితంలో ఉన్న ఒక ఆడ మనిషి గురించి చెప్పిన ఆ ముక్యమైన స్త్రీ ఎవరో తెలుసుకుందాం. చిరంజీవి జీవితంలో ఇలా నిలబడ్డానికి కారణం ఆయన భార్య సురేఖ అని ఈమంది రామారావు చెప్పడం జరిగింది.
సామాన్యమైన కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవిని.. ఎప్పటికైనా పైకొస్తాడని గుర్తించి అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి వాళ్ల కూతురు సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సురేఖ ఏ రోజు కూడా నేను గొప్ప కుటుంబం నుంచి వచ్చానని ఆలోచించకుండా.. తన అత్తింటి వాళ్లందర్నీ ఆదరించి.. ఇద్దరి మరుదుల్ని, ( Chiranjeevi wife Surekha important role ) ఆడపడుచుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ.. అలాగే అత్తమామలకి ఎంతో సేవ చేసుకుంటూ.. అన్ని వైపులా ఆవిడ ఉత్తమ కోడలుగా, ఉత్తమ వదినగా, ఉత్తమ ఇల్లాలుగా తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె అలా ప్రతి బంధాన్ని చూసుకుంటూ రావడం వల్లనే చిరంజీవి ప్రశాంతంగా తన కెరీర్లో తాను కష్టపడగలిగాడు.
తమ్ముళ్ల గురించి గానీ, చెల్లెళ్లు గురించి గానీ, తల్లిదండ్రుల గురించి గానీ, చిరంజీవి ప్రత్యేకంగా టైం పెట్టి.. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? అని ఆలోచించే పని లేకుండా.. కేవలం తన కెరీర్లో తన కష్టపడుతూ తెచ్చిన సంపాదనతో భార్య ఇంటిదగ్గర ప్రతి బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. అందరి జీవితాల్లో ఏం కావాలో చూసుకుంటూ.. చిరంజీవి పర్సనల్ లైఫ్ లో అన్ని బంధాల్ని ఆవిడే మోస్తూ.. అతనికి టైంని సినిమా రంగం కోసం ఇచ్చింది కాబట్టే.. ఈరోజు అతను ఈ స్థాయిలో ఉండి, ఈ జనరేషన్ లో అందరికీ కూడా ఆయన ఒక పెద్దగా.. ఒక గౌరవ స్థానంలో నిలబడగలిగాడని ఈమంది రామారావు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నిజమే ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం చిరంజీవి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సురేఖ గారి గురించి ఎప్పుడు మంచిగానే చెప్తారు. నిజంగా చిరంజీవికి అటువంటి భార్య దొరకడం అదృష్టమనే అందరూ అనుకుంటున్నారు. ఈ మాట చిరంజీవి కూడా చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.