Home Cinema Chiranjeevi – Venkatesh: చిరంజీవి – వెంకటేష్ కలిసి నటించాలనుకున్న ఆ ఆగిపోయిన చిత్రమిదేనా.?

Chiranjeevi – Venkatesh: చిరంజీవి – వెంకటేష్ కలిసి నటించాలనుకున్న ఆ ఆగిపోయిన చిత్రమిదేనా.?

Chiranjeevi Venkatesh Combination: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఇప్పటికీ కూడా సీనియర్ హీరోలుగా కొనసాగుతూ వాళ్ళ సత్తా చాటుతూనే ఉంటూ.. ఇప్పుడున్న కుర్ర హీరోలకు ధీటుగా మేమేం తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో ప్రస్తుతం స్టారర్ మూవీ ట్రెండ్ ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే మనమంతా చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోలు సైతం కలిసి ఒకే చిత్రంలో నటించేస్తున్నారు. ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఆ తర్వాత కృష్ణ మరియు శోభన్ బాబు లు అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాలు తీయడం కామన్ గా జరిగేది.

chiranjeevi-venkatesh-combination-multi-starrer-movie-in-talks-shooting-to-begin-soon

ఇక వాళ్ల తరువాత ప్రస్తుతం సీనియర్ హీరోలాగా కొనసాగుతుంది మాత్రం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళ జనరేషన్ మొదలయ్యాక ఈ మల్టీస్టారర్ ట్రెండ్ అనేది విపరీతంగా తగ్గిపోయింది. కానీ మళ్ళీ ఆ మల్టీ స్టార్ అనే ట్రెండ్ ను పునః ప్రారంభించింది మాత్రం హీరో విక్టరీ వెంకటేష్.. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి విక్టరీ వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనమంతా చూశాం.. దాంతో చిన్న చిన్నగా మళ్లీ మల్టీ స్టారర్ చిత్రాలు ఇండస్ట్రీలో తన దూకుడుని మొదలు పెట్టాయి. ఇక సీనియర్ హీరోలతో విక్టరీ వెంకటేష్ ఇప్పటికి మల్టీ స్టార్ చిత్రాలను చేస్తూ పోతున్నాడు.

See also  Rashmika: ఆఖరికి రష్మిక పనిమనిషి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం అతనేనా?

chiranjeevi-venkatesh-combination-multi-starrer-movie-in-talks-shooting-to-begin-soon

విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉండేదట. ఇక ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ.. ఎందుకో ఏమైందో అప్పట్లో వీళ్ళ బిజీ షెడ్యూల్ కారణం చేత ఈ చిత్రాన్ని చేయలేకపోయారా? మరి అసలు విషయం ఏందో ఇప్పుడు చూద్దాం.. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే.. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం అందాజ్ అప్నా అప్నా అనే మల్టీస్టారర్ చిత్రాన్ని 1994వ సంవత్సరంలో విడుదల అయ్యి సూపర్ డూపర్ బంపర్ హిట్ కొట్టారు. ఇక ఈ చిత్రం ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం కామెడీ పంట పండించిందట.. ఇందులో అమీర్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్లు పోటీ పడి మరి కామెడీ పంటలు పండించారు.

See also  Rashmika: ఆ పెళ్ళైన హీరో కోసం ఆ పనులేంటి రష్మిక. మరీ అంత మోజెందుకో.?

chiranjeevi-venkatesh-combination-multi-starrer-movie-in-talks-shooting-to-begin-soon

ఐతే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రముఖ డైరెక్టర్ ఇ.వి.వి సత్యనారాయణ ప్రయత్నం చేశాడట.. ఈ చిత్రంలో నటించడానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. కానీ.. అదే సమయంలో వాళ్ళకి వేరే బడా కమిట్మెంట్ కూడా ఉండడం వల్ల ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిందట. ఇక బాగా ఆలస్యం అవ్వడంతో ఈ చిత్రం గురించి వృధా ప్రయత్నం అవుతుందనే అనుమానంతో ఈ ప్రాజెక్టుని క్యాన్సల్ చేసేసారట.. కామెడీ టైమింగ్ లో కింగ్స్ గా పిలవబడే చిరంజీవి మరియు వెంకటేష్ (Chiranjeevi Venkatesh Combination) లాంటి హీరోలు ఈ సినిమా చేసి ఉంటే వేరే లెవల్లే సంచలనాలు క్రియేట్ చేసి ఉండేది ఈ చిత్రం అంటూ ప్రముఖ ప్రముఖ సినీ పండితులు తెలియజేస్తున్నారు.