Bhola Shankar: భోళా శంకర్ దెబ్బకి చిరంజీవి ఎన్నాళ్లు సినిమాలకి దూరం కావాల్సివస్తుందో ఇప్పుడు ఇప్పుడే లెక్క తేలేటట్టు లేదు. ఒక పక్క ఇంకా ఆచార్య సినిమాకి వచ్చిన నష్టాలు వాటి సెటిల్మెంట్లు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. ఆచార్య ని ( Chiranjevi after Bhola Shankar ) మించిన అట్టర్ ఫ్లాప్ తో చిరంజీవి భోళా శంకర్ కి ఎదుర్కొన్నాడు.. ఇప్పుడు ఈ సినిమా తాలూకా సెటిల్మెంట్స్ కూడా చేయాల్సిన పరిస్థితి. సరే సినిమా అన్నాక ఒక్కోసారి నష్టాలు రావడం, వడకపోవడం సాధారణమే. కానీ ఇంత భయంకరమైన ఫ్లోప్స్ వచ్చినప్పుడు సినిమా కొన్న బయ్యర్లు, థియేటర్ యజమానులకి వచ్చే నష్టాలు అంతా ఇంతా కాదు.
కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అని పెద్ద పెద్ద హీరోలు తమ పారితోషకం నుండి కొంత డబ్బు తీసి వెనక్కి ఇచ్చేస్తారు. కనీసం కొంతలో కొంత అయినా నష్టాల ( Chiranjevi after Bhola Shankar ) నుండి బయట పడతారని. అలా చేయని పక్షంలో ఎంత పెద్ద హీరో అయినా , ఎంత గొప్ప అంచనాలు ఉన్న నెక్స్ట్ ఆ హీరో సినిమా కొనే పరిస్థితి ఉండదు. చిరంజీవి నెక్స్ట్ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కూతురి సుష్మిత నిర్మాణంలో తన నెక్స్ట్ సినిమాని చిరంజీవి ప్లాన్ చేసుకున్నాడు.
ఆసినిమా పక్కాగా తెలుగు వారి పండగ అయిన సంక్రాంతికి రిలీజ్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ భోళా శంకర్ ఫ్లాప్ అవడమే కాకుండా చిరంజీవి మోకాలికి సైతం సర్జరీ తప్పని పరిస్థితి ఏర్పడింది. సర్జరీ కూడా ఢిల్లీ అయితే బెస్ట్ ( Chiranjevi after Bhola Shankar ) అనుకుంటున్నారు అంట. ఒకవేళ అదేగనక జరిగితే చిరంజీవి కనీసం మూడు నుండి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోక తప్పదు. సో.. తన కూతురు నిర్మాణం లో చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్న సినిమా కనీసం జనవరికి షూటింగ్ మొదలు పెట్టగలిగిన పరిస్థితి ఉంటుందో లేదో కూడా తెలియదు.
దీన్ని బట్టి చూస్తే చిరంజీవి నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ సమ్మర్ దాటాల్సిందే. కాబట్టీ చిరంజీవి అభిమానులు ఈసారి మనకు పండగ అన్నమాటే లేకుండా పోయిందే అని తెగ ఫీల్ అవుతున్నారు. ఇప్పటి నుండి తీసుకుంటే తెలుగు వారికి ఎంతో ప్రీతి పాత్రమైన అనేక పండగలకి తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయితే.. ఇంటిళ్ల పాది ఎంజాయ్ చేయడం సినిమా అభిమానుల అలవాటు. అలాంటిది సినిమానే లేదంటే.. వాళ్ళ మనసు చాలా బాధగా ఉంటాది. అభిమానుల ఆనందం కోసం అయినా చిరంజీవి ఎదో రకంగా అలోచించి వీలైనంత తొందరగా సినిమా తీస్తే బాగుణ్ణు బాగుణ్ణు అని అనుకుంటున్నారు.