Bhola Shankar : మెగాస్టార్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చెల్లెల పాత్రలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన బోలా శంకర్ ( Bhola Shankar pre-release event ) సినిమా గురించి మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగా అభిమానులు ఎంతో ఆనందంగా వెళ్లారు. అక్కడ చిరంజీవిని చూసి ఆనందంతో పొంగిపోయారు. తాత అయినప్పటికీ కూడా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతున్న వాళ్ళ హీరో గొప్పతనాన్ని చూసి గర్వించారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల అరుపులు, కేకలు చూసి ఆనందంతో పొంగిపోయారు.
ఇక అభిమానులను చూసి చిరంజీవి తనదైన శైలిలో స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టారు.. ఎప్పుడు చెబుతున్నదే మళ్లీ చెప్తున్నాను.. నన్ను ఆదరించింది, నాకింత శక్తినిచ్చింది కేవలం అభిమానులే అని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. సినిమా రంగం అనేది అందరికీ చెందుతుందని.. ఇది పుష్పక విమానం లాంటిదని.. ఎంతమంది ( Bhola Shankar pre-release event ) వచ్చినా ఆదరిస్తుందని.. ఎవరికైనా అన్నం పెట్టే తల్లిని.. ఆయన చెప్పారు. నన్ను చూసి ఆదర్శంగా తీసుకుని.. ఎంతోమంది సినిమా రంగంలో అడుగుపెట్టి నిలబడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇంకా ఆయన సినిమాల్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఎలాంటివి ఎదుర్కొన్నారో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు.
సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత చిన్న చిన్న పాత్రలన్నీ చేసేవాడినని.. ఒకసారి కృష్ణ గారి పక్కన చిన్న పాత్ర చేయమన్నారని.. అప్పటికే నేను శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలు ఒప్పుకున్నాను.. ఈ టైం లో ఇలాంటి పాత్ర చేస్తే ఏమైనా ప్రాబ్లమా అనే ఆలోచిస్తే.. చేయండి సార్ పర్వాలేదు అన్నారు. అయితే ( Bhola Shankar pre-release event ) చెయ్యాలనిపించక పోయినా కూడా.. చేయకపోతే ఎదగలేనేమో.. నాకు ఏమైనా సమస్యలకు వస్తాయేమో అనే భయంతో నేను ఆ సినిమా నటించడం జరిగింది అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి భయంతో సినిమాని నటించిన సినిమాలు కూడా ఉన్నాయా? మా హీరో ఇంత కష్టపడ్డాడా అని అభిమానులు బాధపడ్డారు.
ఇదిలా ఉంటే భోళా శంకర్ సినిమా తమిళ్లో వేదాళం సినిమా రీమేక్. చిరంజీవి మాట్లాడుతూ.. రీమేక్ చేస్తున్నాను అనగానే అందరూ నెగిటివ్గా ఏదో కామెంట్స్ చేస్తారు. ఇతర భాషల్లో మంచి కథ ఉన్నప్పుడు తీసుకొని చేయడంలో తప్పేమీ లేదు.. పైగా మంచి కంటెంట్ దొరికినప్పుడు దాన్ని మన తెలుగు అభిమానులకు అందించడంలో తప్పేముంది? అలాగే ఈ సినిమా ఓటీటీ లో ఎక్కడా కూడా లేదు. అందుకే నేను అన్ని ఎంక్వయిరీ చేసుకునే ధైర్యంగా భోళా శంకర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఖైదీ నెంబర్ 150 లో ఒక డైలాగ్ ఉంది.. నాకు నచ్చిందే చేస్తాను. ఆ డైలాగ్ ఇప్పుడు చెప్తున్నాను నాకు ఈ కథ నచ్చి ఈ సినిమా నచ్చే చేసాను. మీకు కూడా నచ్చేలాగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పై మెగా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.