
Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు అభిమానుల గుండెల్లో.. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్థానం ఏమిటో మనందరికీ తెలిసిందే. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. కేవలం ఆయన స్వయంకృషితో ఇక్కడ వరకు వచ్చిన గొప్ప స్టార్ చిరంజీవి. ఆయిన ఎంత ఎదిగినా.. తన మాటలో గాని, తన ప్రవర్తనలో గాని.. ఎంతో ( Chiranjeevi property value in Kokapeta ) ఒదిగితనం ఉన్న మనిషి ఆయన. ఇప్పటికీ ఆయన మాట తీరులో నెమ్మది తత్వం, గౌరవం.. నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి.. నాకంటే చిన్న వాళ్ళతోనో.. లేని వాళ్లతోనో ఎలాగైనా మాట్లాడొచ్చు అని తత్వం ఎప్పుడు కనిపించలేదు.. ప్రతి ఒక్కరితో గౌరవంగా వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ మాట్లాడతారు.
అందుకే మెగాస్టార్ చిరంజీవిని చూసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది ఉత్సాహంతో అడుగుపెట్టారు. ఈరోజు ఎంతో సక్సెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శం అంటే ఆయనే. ఆయన చూపించే దారంటే అందరికీ ఇష్టం. కష్టపడితే ( Chiranjeevi property value in Kokapeta ) ఇలాంటి స్టార్ హీరో అవ్వచ్చు అని అందరికీ ఆశ. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఆయన కొడుకు రామ్ చరణ్, ఆయన మేనల్లుళ్లు, తమ్ముడు కొడుకు, బావమరిది అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ అందరూ కూడా ఈరోజు మెగా హీరోలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని లో ఒక వెలుగు వెలుగుతున్నారు. వాళ్లంతా కూడా నిత్యం చెప్పుకునే మాట మా హీరో మా మెగాస్టార్ చిరంజీవి అనే..
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే మనవరాలు పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఏకైక తనయుడు రామ్ చరణ్ కి ఉపాసనకి క్లిం కార అనే ఆడపిల్ల పుట్టింది. మనవరాలు పుట్టిన వేల విశేషం చిరంజీవికి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. మనవరాలు ( Chiranjeevi property value in Kokapeta ) కడుపున పడిన వెంటనే ఆ ఇంట్లో అన్ని ఆనందాలే.. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్.. రామ్ చరణ్ కి ఆయన నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటకి ఆస్కార్ అవార్డు.. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం.. ఇవన్నీ ఒక వంతు అయితే, ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ వింటే అందరూ ఆశ్చర్యపోతారు.
మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ కోకాపేట్ లో కొంత భూమిని కొన్నారంట. అది ఈరోజు సడన్గా ఎకరం 100 కోట్లకు పలుకుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే ఆయనకున్న భూమిని బట్టి ఆయనకు రెండు వేల కోట్ల ఆస్తి పెరిగినట్టు అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా.. ఆ స్థలంలో కొంత భాగాన్ని ఆయన సోదరీమణులకు రాశారు అంట. అంటే ఇప్పుడు వాళ్ల పరిస్థితి కూడా ఎక్కడికి వెళ్లి ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్కసారిగా చాలా డబ్బు వాళ్లకు కూడా వస్తుంది. ఆయన కృషి, పట్టుదలతో, కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక స్థలాన్ని కొనుక్కొని అందులో సోదరీమణులకు కూడా ఇచ్చి.. ఈరోజు అది రేటు పెరిగి వాళ్ళ జీవితాలు కూడా తారుమారయ్యేంతగా సక్సెస్ కుటుంబానికి అందించిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అభిమానులు వాపోతున్నారు..