Home Cinema Bhola Shankar premiere talk : భోళాశంకర్ ప్రీమియర్ రియల్ టాక్ తెలుసా?

Bhola Shankar premiere talk : భోళాశంకర్ ప్రీమియర్ రియల్ టాక్ తెలుసా?

chiranjeevi-movie-bhola-shankar-premiere-talk

Bhola Shankar : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు చిరంజీవి ఈరోజు వాళ్ళ ముందుకి వచ్చేసాడు. భోళాశంకర్ ప్రీమియర్ షో వేసేసారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ ( Bhola Shankar premiere talk ) చెల్లెల పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మెగా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి ఈ సినిమాపై అభిమానులకు చాలా భరోసానే ఇచ్చారు. వేదాళం సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమా.. రీమేక్ అయినా కూడా చాలా బాగా ఆదరించే సినిమా అని.. చాలా మంచి కంటెంట్ అని చెప్పడం జరిగింది.

chiranjeevi-movie-bhola-shankar-premiere-talk

అయితే ఇప్పుడు ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమాపై నెగటివ్ టాక్ వచ్చింది. భోళాశంకర్ అట్టర్ ఫ్లాప్ అని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని అంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా తర్వాత.. చిరంజీవి ( Bhola Shankar premiere talk ) ఇలాంటి సినిమాని ఎలా ఎన్నుకున్నాడని తలలు పట్టుకుంటున్నారు. అభిమానులు ఇక మెహర్ రమేష్ పై విపరీతమైన కోపోడివేకంతో ఉన్నారు. చిరంజీవి ఫాన్స్ కి ఆయనకున్న ఫాలోయింగ్ కి ఇలాంటి కథని ఈ రకంగా తీస్తాడా అని మండిపడుతున్నారు. సినిమాలో ఎక్కడా కూడా అసలు చిరంజీవికి తగ్గ కథలాగాని, కథనం కాని, సీన్స్ గాని లేవని అంటున్నారు.

See also  Anasuya: 9 ఏళ్లపాటు కలిసుండి అలా చేసాం కానీ నా భర్త విషయంలో ఇది తెలుసుకోలేకపోయానంటూ సంచలమైన విషయాలను వెల్లడించిన అనసూయ

chiranjeevi-movie-bhola-shankar-premiere-talk

అక్కడక్కడ కామెడీ ఉన్నా కూడా అదేమీ పెద్దగా పండలేదని.. పేలగా ఉందని అంటున్నారు. మరోపక్క సెంటిమెంట్ అయితే అసలు కుదరలేదని అంటున్నారు. ఎక్కడా కూడా సెంటిమెంట్ ఫీలింగ్ కలగలేదని అంటున్నారు. అసలు ( Bhola Shankar premiere talk ) దర్శకుడు ఏమి ఊహించుకుని ఈ కథని తీసుకున్నాడు? ఏ ఊహించుకొని దీన్ని డైరెక్షన్ చేశాడో తెలియడం లేదు కానీ.. ఇంత దారుణంగా ఎలా తీశాడని? మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులైతే చాలా అప్సెట్ అయ్యారని అంటున్నారు. సినిమా ప్రీమియర్ షో నే ఇలాంటి రిజల్ట్ ఉంటే.. ఇక కలెక్షన్స్ ఎలా వస్తాయో అని భయపడుతున్నారు.

See also  Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

chiranjeevi-movie-bhola-shankar-premiere-talk

వేదాళం సినిమా ఓటీటీ లో ఎక్కడా కూడా రాలేదని.. కాబట్టి ఈ సినిమా కథ ఎవరికీ ఇబ్బంది కలగదని.. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిరంజీవి నోటితో చెప్పడం జరిగింది. నాకు నచ్చే ఒప్పుకున్నాను, నాకు నచ్చే చేశాను.. మీకు కూడా నచ్చే విధంగానే సినిమా ఉంటుంది అని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ప్రీమియర్ షో కి సాధ్యమైనంత వరకు అభిమానులు మాత్రమే వెళ్తారు. అలాంటి ప్రీమియర్ షో రిజల్ట్ ఇలా రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఏమో ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ అందుకొని కూడా నెమ్మదిగా మంచి టాక్ లోకి వెళ్తాయి. మరి అలా ఏమైనా ఛాన్స్ ఉందేమో ఒక రెండు షోలు అయిన తర్వాత చూడాలి. ఏదేమైనా మెగా కుటుంబం పరువు తీసాడు మెహర్ రమేష్ అని అభిమానులు కోపంతో ఉన్నారు.