Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఒక పండగ సందర్భం నెలకొంది. జూన్ 20వ తారీకు నుంచి మెగా ఇంట్లో ప్రతీరోజు పండగలనే ఉంది. మెగా ప్రిన్సెస్ ఇన్నేళ్ల తర్వాత మెగా కుటుంబంలోపుట్టి.. అటు రామ్ చరణ్ కి ఇటు మెగా అభిమానులకి ( Chiranjeevi granddaughter Barasala ) ఎంతో ఆనందాన్ని కలిగించిన దేవతగా చూస్తున్నారు. మంగళవారం నాడు మెగా కుటుంబానికి సెంటిమెంట్ తో కూడిన రోజు నాడు రామ్ చరణ్ కి కూతురు పుట్టడం చిరంజీవి ఎంతో ఆనందంగా భావించారు. అందుకే మంగళవారం నాడు ఆ ఆంజనేయస్వామి అమ్మవారు ఆశీర్వచనంతో పుట్టినందుకుగాను.. లలిత అమ్మవారి సహస్రనామాలు నుంచి క్లిం కార అనే నామమునే ఎంచుకొని మెగా ప్రిన్సెస్ కి క్లిం కార కొణిదెల అని పేరు పెట్టడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి డెకరేషన్ మొత్తం కూడా ఎంతో శాస్త్రబద్ధంగా చేయించారు. అమ్మవారికి ఇష్టమైన పచ్చదనాన్ని కనిపించేలా.. చెట్లు, ఆకులు అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు తో ( Chiranjeevi granddaughter Barasala ) డెకరేషన్ చేయించి.. ఉయ్యాల కూడా ఎంతో సాంప్రదాయంగా.. పట్టు చీరతో ఉయ్యాల కట్టి.. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరూ కూడా పట్టు వస్త్రములు ధరించి.. ఎంతో సాంప్రదాయంగా.. నిజంగానే అమ్మవారికి పేరు పెట్టేటప్పుడు అమ్మవారికి సంబంధించిన పూజ చేసేటప్పుడు.. ఆమెను ఎంత భక్తిశ్రద్ధలతో దాంట్లో మనం పాల్గొంటాము.. అలాగే వాళ్ళంతా కూడా మెగా ప్రిన్సెస్ కి పేరు పెట్టేందుకు కూర్చున్నారు.
ఎంతో సాంప్రదాయంగా ఈ వేడుక ప్లాన్ చేయగా.. ఈ ఫంక్షన్ కి మెగా కుటుంబం అంతా, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి ఎంతో ఆనందంగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంత సామాన్యుడు ఇంట్లో అయినా ఒక వేడుక జరిగితే ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా కామన్ విషయం. అలాగే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi granddaughter Barasala ) ఇంట్లో కూడా ఈ వేడుక సందర్భంగా చిరంజీవి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అయితే రిటర్న్ గిఫ్ట్ అంటే ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటారు? ఎలాంటివి ప్లాన్ చేసి ఉంటారు? ఎంత వెరైటీగా ఉంటుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చిరంజీవి ఫంక్షన్ ఎంత సాంప్రదాయ బద్ధంగా చేశాడో అలాగే రిటర్న్ గిఫ్టును కూడా అంతే సాంప్రదాయపద్ధంగా ఇచ్చారని అనుకుంటున్నారు.
మెగా మనవరాలు క్లిం కార కి పేరు పెట్టిన సందర్భంగా అక్కడికి విచ్చేసిన అందరికీ కూడా చిరంజీవి రిటన్ గిఫ్టుగా ఆడవాళ్ళకి పట్టుచీరలు, మగవాళ్ళకి పట్టుబట్టలతో పాటు బంగారపు కాయిన్ కూడా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా క్లీన్ కారు ఎంత అదృష్టవంతురాలో ఇప్పుడు అర్థమవుతుంది. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచించి.. ఎప్పుడు పిల్లల్ని కనాలో అనుకుని.. అది కూడా ఎంతో శుభదినం నాడు, ఎంతో మంచి గడియల్లో పుట్టి జాతకరీత్యా అన్ని అదృష్టవంతురాలైన మహాజాతకురాలను కని.. ఆమెకు చేసే ప్రతి వేడుక కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉండడం.. పైగా ఘనంతో పాటు సాంప్రదాయబద్ధంగా.. ఇటు నాన్నమ్మ తాతలతో, అటు అమ్మమ్మ తాతలతో ఇంత వేడుకగా జరగడం నిజంగా ఆచిన్నారి అదృష్టం..