Home Cinema Chiranjeevi : రాధ కూతురు పెళ్ళిలో చిరంజీవి తన పాత హీరోయిన్స్ తో ఎంత అల్లరి...

Chiranjeevi : రాధ కూతురు పెళ్ళిలో చిరంజీవి తన పాత హీరోయిన్స్ తో ఎంత అల్లరి చేసాడో ఫొటోస్ వైరల్..

chiranjeevi-enjoyed-senior-heroine-radha-daughter-karthika-nayar-marriage

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రింగుల్లో అడుగుపెట్టి ఎన్నో ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన క్రేజ్ ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. సినిమాల్లో కొత్త రకంగా డాన్స్ వేయడం, ఆ డాన్స్కి చాలా ప్రాముఖ్యతను తీసుకురావడం, అలాగే ఫైట్స్ కి విపరీతమైన క్రేజ్ ని తీసుకురావడం ఇవన్నీ కూడా ( Chiranjeevi at Karthika Nair marriage ) చిరంజీవి సినిమాలు నుంచే ఎక్కువగా మొదలయ్యాయి. బ్రేక్ డాన్స్ అనేది ఆయన సినిమాలోనే తెలుగులో మొదట మొదలైంది. అలా తెలుగు వాళ్లకి డాన్స్, ఫైట్స్ ని రుచి చూపించి వాటికి విపరీతంగా ప్రాముఖ్యతను తీసుకువచ్చి అలవాటు చేసిన హీరో చిరంజీవి. చిరంజీవికి వయసు 70కి దగ్గర వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఆయన ఎంతో యాక్టివ్గా ఉంటారు.

Chiranjeevi-Radha-daughter-marriage-Karthika-Nair

ఒకపక్క సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క ఆయన వ్యాపారాలు చూసుకుంటూ.. కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ.. అలాగే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, దగ్గర చుట్టాలు, ఆయన స్నేహితులు అందరికీ సంబంధించిన వేడుకలకు అటెండ్ అవ్వడం.. వాటిలో ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. జీవితం విలువ బాగా తెలిసిన ( Chiranjeevi at Karthika Nair marriage ) వ్యక్తి అంటే చిరంజీవి అని అర్థమవుతుంది. ఎంత సంపాదించినా కొన్ని ముచ్చట్లను, కొన్ని ఆనందాలని మిస్ కాకూడదని.. చనిపోయే లోపు వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేయాలని, జీవితం ప్రతిరోజు విలువైందని తెలిసిన వ్యక్తిలా చిరంజీవి ఎప్పుడు కనిపిస్తారు. బాధ్యతలను ఎప్పుడు మోస్తూ.. బాధ్యతగా బ్రతకడమే కాకుండా.. ఎంజాయ్ చేస్తూ కూడా ఉండే వ్యక్తి చిరంజీవి.

See also  Animal movie OTT : అనిమల్ సినిమా ఒటిటి లో..

Chiranjeevi-Radha-daughter-marriage

అప్పట్లో చిరంజీవి సరసన ఎందరో హీరోయిన్స్ నటించారు. ఆ సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పుడు సినిమాల్లో చాలామంది నటించడం లేదు కూడా. రాధిక, రాధ, సుహాసిని, విజయశాంతి, జయప్రధ, జయసుధ ఇలా ఎందరో హీరోయిన్స్ చిరంజీవితో అప్పట్లో నటించారు. ఇప్పటికీ వాళ్ళలో కొంతమంది సినిమాల్లో నటించకపోయినా ( Chiranjeevi at Karthika Nair marriage ) కూడా చిరంజీవితో టచ్ లో ఉంటారు.వాళ్ళందరూ కలిసి సరదాగా ఒక ఈవెంట్ పెట్టుకోవడం, ఎంజాయ్ చేయడం, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఇటీవల రాధిక కూతురుకి పెళ్లి జరిగింది. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకి హీరోయిన్గా జోషి సినిమాలో మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక గురించి మనందరికీ తెలిసిందే.

See also  Chiranjeevi : ఆ సీరియల్ లో చిరంజీవి ఉన్నాడా.. మెగాస్టార్ ఆ సీరియల్ లో నటించడానికి అసలు కారణం అదా!

Chiranjeevi-Radha-daughter-marriage-viral

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా.. సినిమా ఇండస్ట్రీలో గట్టిగా నిలబడలేకపోయిన హీరోయిన్స్ లో కార్తీక్ నాయర్ ఒకర్తి. జోష్ చేసిన తర్వాత.. ఆ సినిమాకి పెద్ద పేరు రాకపోవడంతో.. ఆమెకు పెద్ద పేరు రాలేదు. ఆ తర్వాత ఏవో కొన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. రంగం సినిమాతో ఆమెకు కొంచెం పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ఆమెకు మంచి ఆఫర్స్ అయితే రాలేదు. ఇక సినిమాలను పెద్దగా పట్టించుకోకుండా.. ఆమె సొంత బిజినెస్ లు చూసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆమెకు రాధ ఎంతో వైభవంగా పెళ్లి చేసింది. ఈ పెళ్లికి చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి ఇలా అందరూ వెళ్లి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి అయితే తన పాత హీరోయిన్స్ తో అల్లరి చేస్తూ ఫోటోలు దిగినవి అన్ని చూసి మెగా అభిమానులు పొంగిపోతున్నారు.