
Chiranjeevi – Baby: ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా, విరాజ్ ముఖ్యపాత్రలో నటించిగా.. సాయి రాజేష్ దసకత్వంలో రూపొందిన బేబీ సినిమా ఎంత హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేలాగా దూసుకుపోతుంది. అసలు ఎటువంటి అంచనాలు ( Chiranjeevi comments on the Baby movie ) లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఈరోజు కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో చిత్ర బృందం వారు సక్సెస్ మీట్ కింద ఒక వేడుకను చేసుకున్నారు. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరయ్యి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన అభిమానులు ఇంత మంచి దారిలో వెళ్తూ.. పైగా తనను చూసి చిరంజీవి వెళ్లిన దారిలోనే వెళ్లాలని గట్టిగా నిర్ణయం తీసుకుని సినిమా రంగంలోకి వచ్చి.. ఇంత సక్సెస్ను సాధించినందుకు నాకు చాలా గర్వకారణంగా, ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ( Chiranjeevi comments on the Baby movie ) ప్రతి క్యారెక్టర్ చాలా గొప్పదని.. ఇందులో ఎవ్వరు చెడ్డవాళ్ళు లేరని.. నిజంగా ఒక విలన్ లేకుండా ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన సాయి రాజేష్ ని పొగడకుండా ఉండలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ చాలా అద్భుతంగా నటించిందని అన్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత వైష్ణవి చైతన్య ఎన్నో సినిమా ఇది అని అడిగానని.. ఆమెది మొదటి సినిమా అని తెలియగానే ఆశ్చర్యపోయానని.. మొదటి సినిమాలో ఇన్ని వేరియేషన్స్ తో, ఇన్ని రకాల సీన్స్లో, ఇంత బాగా ప్రతి సీన్ ని పండించిన హీరోయిన్ అంటే.. నిజంగా ఆమెని చూస్తుంటే.. సహజనటి జయసుధ గుర్తుకొస్తుందని ఆయన చెప్పారు. ఎలాంటి( Chiranjeevi comments on the Baby movie ) పాత్ర ఇచ్చిన.. ఎలాగైనా కూడా ఎంతో అద్భుతంగా చాలా సహజంగా జయసుధ నటించేస్తుందని.. అలాగే అలాంటి మనిషి ఇప్పుడు నాకు వైష్ణవి చైతన్య కనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు కూడా తమ తమ పాత్రలను ఎంతో చక్కగా నటించారని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఈ సినిమా కథ విన్నప్పుడు లాస్ట్ లో క్లైమాక్స్ గురించి తెలిసినప్పుడు దర్శకుడు కి నేను ఒక సలహా ఇచ్చానని.. క్లైమాక్స్లో హీరోయిన్ పెళ్లి చేసుకుని హాయిగా భర్త దగ్గర తను బానే ఉండి.. ఆనంద్ ని చూడగానే కొంచెం ఫీల్ అయ్యింది. ఒకవేళ చూడకపోతే ఆమె భర్తతో హాయిగా బానే బ్రతికేస్తుంది కదా.. కానీ అలాంటి క్లైమాక్స్ కంటే.. ఆమె ఏదో ఒక ఆశ్రమంలోనో లేదా ఏదో సేవా సంఘం లోనో ఏదో ఒకటి చేస్తూ ఉండేలా కనిపి చూపిస్తే బాగుంటుందేమో అని.. నేను ఒక మంచి సలహా ఇచ్చేసానని పొంగిపోయి వెళ్ళిపోయాను. కానీ అతను ఈరోజు ఈ క్లైమాక్స్ ని ఇలా చూపించిన తర్వాత నాకు అనిపించింది అతను చేసింది రైట్ అని. నేను ఇచ్చిన సలహాయే తప్పని నాకు తెలిసింది. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఏదో ఒక తప్పు ఒకసారి జరిగిపోయింది అని జీవితాంతం తనకు నచ్చనిదారిలో నిరాశతో బతకాల్సిన అవసరం లేదని.. ఆశతో అడుగులు ముందుకేస్తే మళ్లీ తన జీవితంలో మంచి రోజులు వస్తాయని.. ఇది చూసి ప్రతి ఒక్కరు నేర్చుకుని ఇలాగే ఎక్కడా నిరుత్సాహపడిపోకుండా.. ఆశతో ముందుకు జీవితాన్ని తీసుకొని వెళ్లాలని చిరంజీవి చెప్పుకొచ్చారు.