Bhola Shankar: భోళా శంకర్ సినిమా చాల ఛండాలంగా ఉంది అందులో నో డౌట్! కానీ భారీ డిజాస్టర్ కావడానికి మెగాస్టార్ చిరంజీవి అనాలోచితంగా చేసిన రెండు కామెంట్స్ మెడకి చుట్టుకున్నాయి. ఒకటి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ( Bhola Shankar movie disaster ) విజయసాయి రెడ్డి గారిని ఉద్దేసించి, రాజ్యసభ లాంటి పెద్దల సభలో సినిమా హీరోల పారితోషకం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దాని బదులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడండి అని సలాహా ఇస్తూ.. పిచుక మీద బ్రహ్మస్త్రం ఎందకు అంటూ చురకలంటించారు. అసలే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా వుండే విజయ సాయి రెడ్డి గారు చిరంజీవి కి గట్టిగా కౌంటర్ ఇచ్చిపడేశాడు.
దానికి తగినట్టే వైస్సార్సీపీ సోషల్ మీడియా మొత్తం తగులుకునింది. వీళ్లకి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి కావడం పవన్ కళ్యాణ్ చిరంజీవికి అన్నకావడంతో టార్గెట్ అయిపోయాడు. సినిమా కూడా మరీ నాసిరకంగా ఉండటంతో ( Bhola Shankar movie disaster ) ప్రత్యర్థుల పని మరీ సులువు అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. విజయసాయి రెడ్డి గారు సినిమా ఆటోగ్రాఫీ సవరణ బిల్లు మీద మాట్లాడుతూ.. ఆయన అనేక సవరణలని ప్రతి పాధించారు. నిర్మాతలు , డైరెక్టర్స్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక కూడా కేసుల్లో ఇరుకుంటున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పారు.
అంతే కాకుండా సినిమా నిర్మాణం లో కొంత మంది హీరోలు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారని, ఏదో రకంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే అందరికీ ఆర్ధికంగా న్యాయం చేసేటట్టు, మంచి పారితోషకం ఇచ్చేట్టు చట్టసవరణ జరగాలని విజయ్ సాయి రెడ్డి గారు ప్రతిపాదించారు. దీనితో ( Bhola Shankar movie disaster ) పాటు భారత దేశంలో సినిమా హాళ్ల నిర్మాణం కూడా జరగాలని చైనాలో అత్యధిక సినిమాహాళ్లు ఉన్నాయని, అలా భారత దేశంలో కూడా సినిమా హాళ్ల నిర్మాణం జరగాలని ఆయన ప్రతిపాదించారు. ఇవన్నీ వదిలేసి ఎవరో చెప్పిన మాటలు విని చిరంజీవి గారు నోరు జారడంతో.. అది కూడా సినిమా ముందు రోజు అనడంతో ఒక వర్గంలో మెజార్టీ జనాల కి సినిమా టార్గెట్ అయింది.
చిరూ చేసిన మరో కామెంట్ ఏంటంటే.. అప్పట్లో నేను.. అంటూ బాలయ్య బాబు లా దీర్ఘం తీసి మాట్లాడుతూ .. అప్పట్లో నేను అన్నావంటే .. ఇప్పుడు నువ్వేంకాదని ఇప్పుడేం కావు అన్నమాట అన్నారు.. అది నేరుగా తెలుగుదేశం భోళా శంకర్ సినిమా చాల ఛండాలంగా ఉంది అందులో నో డౌట్! కానీ భారీ డిజాస్టర్ కావడానికి మెగాస్టార్ చిరంజీవిబాలకృష్ణ అభిమానులకి తాకింది.. దెబ్బతో.. సందట్లో సడేమియాలాగా ఒకరేంజిలో చిరంజీవిని ఆ సెక్షన్ వాళ్లు అందరూ టార్గెట్ చేశారు ! కాకపోతే చాల తెలివిగా తమ ఆపోజిట్ వాళ్ల కామెంట్స్ ఎక్కువ మోతాదులో ప్రాధాన్యత ఇచ్చారు.. అందుకే ఎంతటి మెగాస్టార్ కి అయినా “నోరు మంచిది అయితే.. వూరు మంచిది అవుతుందనే సామెత వర్తించక మానదు!.