Chiranjeevi – Venkatesh: అప్పట్లో లవ్ స్టోరీలు ఎంత హిట్ అయ్యో మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలామంది లవ్ స్టోరీ చిత్రాలు అంటే అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ ఒకప్పుడు లవ్ సినిమా విడుదల అయితుందంటే సినీ ప్రియలకు ఓ పండుగ వాతావరణం ఏర్పడేది. అంతలా అప్పటి ప్రజలు ఆ లవ్ సినిమాలకు భారీ స్థాయిలో స్పందించే వారు. ఇక హీరో హీరోయిన్ల నడుమ ఘాడమైన ప్రేమను చూపించేందుకు దర్శకులు విశ్వ ప్రయత్నాలు చేసేవారు. అందుకే అప్పట్లో లవ్ స్టోరీ చిత్రాలు అంటే ఓ రేంజ్ లో డిమాండ్ ఉన్నది. ఇక మనం మాట్లాడుకుంటున్నా ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. 2000 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.
ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ రోజుల్లో లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించుకొని స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. చిత్రం సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా భారీ హిట్ సంపాదించుకొని స్టార్ ఇమేజ్ తన సొంతం చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ తన తదుపరి నటించిన మనసంతా నువ్వే సినిమా చిరంజీవి, వెంకటేష్ లకు అప్పట్లో నిద్ర పట్టకుండా చేసిందట.. అది ఎలాగంటే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే చిత్రం 2001 సంవత్సరంలో సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నారట. అయితే ఇదే సమయంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా సెప్టెంబర్ 6న అంటే ఉదయ్ కిరణ్ సినిమా కంటే ముందు..
విడుదల కాబోతుండడంతో వెంకటేష్ సినిమాకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఉద్దేశంతో ఎమ్మెస్ రాజుని ఆ సినిమాను కాస్త రెండు వారాలు తర్వాత రిలీజ్ చేయమని నువ్వు నాకు నచ్చావు ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేశారట. దాంతో ఎమ్మెస్ రాజు చేసేది ఏం లేక ఈ చిత్రాన్ని మరో రెండు వారాల తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నాడట.. కానీ ఇదే టైం కి చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమా కూడా అక్టోబర్ 4వ తేదీన ఫిక్స్ చేశారు. ఇక ఈ సమయంలో మనసంతా నువ్వే సినిమా విడుదల అయితే కనుక చిరంజీవి నటించిన డాడీ సినిమాకి కలెక్షన్లు తగ్గిపోతాయని ఉద్దేశంతో..డాడీ చిత్ర నిర్మాత ఎమ్మెస్ రాజుని మళ్లీ ఓ రెండు వారాలు ఆగి రిలీజ్ చేయమని అడిగాడట..
దాంతో ఎమ్మెస్ రాజు ఏమి చేయలేని పరిస్థితిలో సరే అని చెప్పి డాడీ సినిమా విడుదలైన తర్వాత రెండు వారాలకి ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే చిత్రాన్ని విడుదల చేశారట. ఇక ఈ చిత్రం చిరంజీవి, వెంకటేష్ ల సినిమాలను పక్కకు నెట్టి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నమోదయింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో చాలామంది ఇండస్ట్రీ జనాలు అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ (Chiranjeevi – Venkatesh) సినిమాలు ఆడనివ్వకుండా వీళ్ళకి నిద్ర పట్టకుండా చేశాడంటూ అప్పట్లో మాట్లాడుకున్నారట.. మనసంతా నువ్వే చిత్రం విడుదలై హిట్ కొట్టిన తర్వాత ఉదయ్ కిరణ్ ఓ రేంజ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.