Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఎంత సందడిగా ఉందో మనందరం ఊహించుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడు రామ్ చరణ్ ఇన్నేళ్లకు తండ్రి కావడం నిజంగా వాళ్లందరి గుండెల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి మెగాస్టార్ కుటుంబంలో ( Chiranjeevi and Ram Charan ) సందడి మొదలయ్యి.. ఉపాసనను మెగా కుటుంబం మొత్తం ఎంతో ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఆ పనులన్నీ చేసుకుంటూనే మరోపక్క ఉపాసనను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. రామ్ చరణ్ అదే క్రమంలో ఉపాసన కూడా తన ఆరోగ్యం మీద తాను చాలా జాగ్రత్తలు తీసుకుంది.
ఉపాసన ప్రెగ్నెంట్ అయిన తర్వాత మెగా కుటుంబం అంతా ఆనందంగా రెండుసార్లు బేబీ షవర్ ఫంక్షన్ కూడా చేశారు. అలాగే రామ్ చరణ్ ఏ దేశం వెళ్లినా.. తనతో పాటు భార్యను కూడా తీసుకుని వెళ్ళిపోయి 24 గంటలు తన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంతో మంచి భర్తగా పేరుపొందాడు. పెళ్లి అయిన ఇన్నేళ్లకు తండ్రి అవుతున్న ( Chiranjeevi and Ram Charan ) రామ్ చరణ్ ఆనందం మాటలతో చెప్పలేనంతగా కనిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలు 10 సంవత్సరాల వరకు పుట్టకపోయేసరికి ఎన్నో ప్రశ్నలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందరో ఉపాసనలో ఏదో లోపం అనేవారు లేదా రామ్ చరణ్ కారణమనేవారు ఇలా ఎన్నో మాటలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మెగా కుటుంబం మాత్రం ఆ మాటలను అస్సలు పట్టించుకోకుండా.. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటూ.. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ హాయిగా నడిపారు. అయితే కొంతకాలం తర్వాత చిరంజీవి మాత్రం రామ్ చరణ్ కి కచ్చితంగా పిల్లలు పుట్టాలని.. తనకి మనవడుని గాని, మనవరాలుని గాని చూడాలని ( Chiranjeevi and Ram Charan ) చాలా ఆశ పుట్టిందట. వెంటనే ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్లి.. రాంచరణ్ జాతకం చూపించగా.. అతను ఏదో దోషం ఉందని.. ఆ పూజ చేస్తేనే రాంచరణ్ ఆ దోషం క్లియర్ చేస్తేనే రాంచరణ్ కి పిల్లలు పుడతారని చెప్పాడంట. అయితే ఇంతకీ అదేమిటంటే.. శివాలయంలో ప్రతి సోమవారం అభిషేకం చేయించాలని చెప్పాడంట. అయితే దానికి రాంచరణ్ అలాంటి దోషాలు అవి నమ్మను అని చెప్పాడంట.
దానితో చిరంజీవి నువ్వు నమ్మిన నమ్మకపోయినా నా తృప్తి కోసం.. ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పగా రాంచరణ్ తండ్రి మాట కాదనలేక సరే అన్నాడంట. ఇద్దరు హైదరాబాదులోనే ఒక దేవాలయానికి రహస్యంగా వెళ్లి అక్కడ ప్రతి వారం శివాభిషేకం చేయించేవారు అట. అలా చేయడం వలన ఈరోజు మెగా ప్రిన్సెస్ మెగా వంశంలోకి వచ్చిందని అందరూ అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో అసలు ఎంత నిజం ఉందో తెలియదు గానీ నిజంగా అలా దోషాలు నమ్మి పూజలు చేయించి ఉంటే అసలు ఉపాసన ఊరుకుంటుందా? ఉపసన ఇలాంటివి అస్సలు నమ్మదు కదా అని కొందరు అంటుంటే.. అసలు ఇలాంటి వార్తల్లో నిజమే లేదు.. అన్నిసార్లు వాళ్ళు హైదరాబాద్లో గుడికి వెళ్తే.. ఈ రెండేళ్లలో ఒక్కసారైనా వార్త రాకుండా ఉంటుందా? అని నెటిజనులు వాపోతున్నారు.