Home Cinema Charmi Kaur: ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఛార్మి.. దీనంతటికి కారణం ఎవరో.. ఎవరికి తెలుసు?

Charmi Kaur: ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఛార్మి.. దీనంతటికి కారణం ఎవరో.. ఎవరికి తెలుసు?

సినిమా రంగంలో మనకు ఎప్పుడూ బాగున్నవాళ్ళు, మంచి ఫేమ్ లో ఉన్నవారు మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ రంగంలో అడుగుపెట్టి.. కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నవారి గురించి మనకు పెద్దగా తెలీదు. హీరోయిన్ ఛార్మి గురించి మనందరికీ తెలుసు. ఆమె పెద్ద పెద్ద కళ్ళు, అందమైన ముఖారవిందంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది కానీ, పెద్ద హిట్స్ తో నిలబడలేకపోయింది.

సాధారణంగా కొత్తగా వచ్చిన హీరోయిన్ కొంచెం బాగుండి ,ఫేమ్ వస్తే.. టాప్ హీరో లు వాళ్ళ సరసన నటించేందుకు ఛాన్స్ బాగానే ఇస్తారు. కానీ ఛార్మి కి మాత్రం, అలా ఛాన్స్ దొరకలేదు. ఎక్కువమంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదు. ఛార్మి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది కానీ, పెద్ద సక్సెస్ అవ్వలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి అనే సినిమా లో నటించడమే కాకుండా నిర్మాణం కూడా చేసింది.

See also  Puri Jagannadh-Sairam: పూరిజగన్నాథ్ తమ్ముడికి సినిమాల్లో సక్సెస్ లేక, చివరికి ఇంటింటికీ..

ఆ సినిమా ఛార్మి కి కొంచెం పేరు తెచ్చిపెట్టడమే కాకుండా, కొంత ఫైనాన్సియల్ గా కూడా బానే వచ్చింది. అప్పటినుంచి పూరితో కలిసి ఆమె కొన్ని సినిమాలు నిర్మించింది కానీ, చాలా డిజాస్టర్స్ ఎదుర్కోవలసి వచ్చింది. తరవాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్ తో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మల్లి వీళ్ళిద్దరూ కలసి, విజయ్ దేవరకొండని హీరో గా పెట్టి భారీ బడ్జెట్ తో లైగర్ సినిమా తీశారు. అంతే ఆ సినిమా వీళ్ళని పూర్తిగా ముంచేసింది.

See also  Amala Paul: విప్పి చూపిస్తున్నానంటున్నా చూసే మోగాడే లేడా.? అయ్యో అమలా పాల్..

దీనితో ఛార్మి అప్పులపాలు అయిపోయి, ఆర్ధికంగా ఘోరమైన స్థితిలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఛార్మి జీవితం ఇలా అవ్వడానికి కారణం పూరి జగన్నాథ్ అని కొందరు అంటే, ఆమె జీవితం అలా అవ్వడానికి కారణం ఆమెనే అని కొందరు అంటే, ఆ దేవుడు ఆలా చేసాడని కొందరు అంటున్నారు. నిజానికి ఎవరి వలన ఆమె జీవితం ఆలా అయ్యిందో ఆమెకే తెలియాలి..