Nayanatara: ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా డబ్బు గురించే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. డబ్బు అనే సమస్య ఎలాంటి బంధాన్ని అయినా, ఎవరినైనా, దగ్గరైనా చేయగలదు.. దూరం ఇంకా బాగా చేయగలదు. అలాంటి డబ్బు సమస్య సామాన్యులకే వస్తాది అని అందరూ అనుకుంటారు కానీ.. సెలబ్రిటీస్ జీవితంలో ( Nayanatara and Vignesh police case ) కూడా ఇది గట్టిగానే ఉంటుందని కొన్నిసార్లు తెలుస్తూ ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఒక వెలుగు వెలుగుతున్న గొప్ప హీరోయిన్ నయనతార. నయనతార గత ఆరు సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ శివ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.
రెండేళ్ల క్రితమే నయనతార విగ్నేష్ శివ ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయిన ఈ జంట ఎంతో హాయిగా ఆనందంగా బ్రతుకుతూ ఉండగా.. వీళ్ళ జీవితంలోకి ఇప్పుడు ఒక ఉప్పెన వచ్చింది. నయనతార ఆమె భర్తపై ( Nayanatara and Vignesh police case ) పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వస్తున్నాయి. నయనతార భర్తపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ వీళ్లిద్దరు మీద పోలీస్ కేసు ఫైల్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరిగిందని ఆశ్చర్యపోతున్నారా? అసలు సంగతేమిటంటే.. నయనతార మరియు ఆమె భర్త పై ఆస్తి అపహరణ కేసు కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ దర్శకుడు ఆస్తి అపహరణ చేయడమేంటి? వీళ్ళ మీద అలాంటి కేసు ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. నయనతార భర్త పూర్వీకులు తిరుచ్చి జిల్లా లాల్ కుడి గ్రామంలో ఉండేవారు. విగ్నేష్ తండ్రి పేరు శివకొళుదు. వీళ్ళు 9 మంది అన్నదమ్ములు. అయితే ( Nayanatara and Vignesh police case ) విగ్నేష్ తండ్రి పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేసేవారు. అతను ఇప్పుడు మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్ లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం ఇద్దరు కలిసి గురువారం నాడు కేసు ఫైల్ చేశారు. తన సోదరుడు విజ్ఞేశ్వర తండ్రి ఉమ్మడి ఆస్తిని వాళ్లకు తెలియకుండా వేరే వాళ్ళకి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని.. ఇక తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చి.. ఆ ఆస్తిని తీసుకువచ్చి తిరిగి వాళ్లకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
చిన్న చిన్న కుటుంబాల్లో చిన్న చిన్న ఆస్తులు గురించే కాకుండా పెద్దపెద్ద కుటుంబాల్లో ఇలాంటి స్టార్టమ్ ఉన్నవాళ్లు ఇళ్లల్లో కూడా ఇలాంటి సమస్యలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విగ్నేష్ తండ్రి ఉమ్మడి ఆస్తిని ఎలా వేరే వాళ్ళకి ఎలా అమ్మేశాడో.. ఇప్పుడు అతను ఎంతకి అమ్మి ఉంటాడో తెలియదు కానీ.. ఇప్పుడు దాన్ని తిరిగి కొనుగోలు చేసే ఇవ్వాలంటే అది ఎన్ని రెట్లు పెరిగిపోయి ఉంటుంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేసుకుంటారు అని అందరూ నివ్వెరపోతున్నారు. ఆస్తి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విఘ్నేష్,అతని తల్లి మీనా కుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు గాని.. దీని మీద పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతనే వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోగలరు. కాబట్టి పోలీస్ అధికారులు దీని దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది.