Pawan Kalyan – Ram Charan : ప్రతి రంగంలో ఎంతో కొంత సెంటిమెంట్ అనేది ఉంటాది. సినిమా రంగంలో వాళ్ళకి సెంటిమెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటాదని అంటారు. సెంటిమెంట్ అంటే ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఇది కలిసొచ్చింది, ఇది కలిసి రాలేదు, ఈ డేట్ మంచిది, ఈ వారం మంచిది ( Can Pawan Kalyan and Ram Charan ) ఇలా ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి సినిమా వాళ్ళకి. సాధారణంగా సినిమాలను శుక్రవారం రిలీజ్ చేస్తారు దాని వెనక కూడా వాళ్ళకి ఏదో సెంటిమెంట్ అనేది ఉంటాది. అలాగే కొందరు వాళ్ళు సినిమాలకి టైటిల్స్ లో ఎక్కువగా పలానా లెటర్ తో స్టార్ట్ అయితే కలిసి వస్తుందని అనుకుంటా.. కొందరు వాళ్ళ సినిమాలో కచ్చితంగా ఫలానా ఆర్టిస్టు ఉంటే కలిసి వస్తాదని అనుకుంటారు. ఇవన్నీ బయటికి ఓపెన్ గా చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళు చేసే విధానాన్ని బట్టి చూసే ప్రేక్షకుడు అనుకుంటాడు.
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ అనేది నడుస్తుంది. ఆ సెంటిమెంట్ కి ప్రతి హీరో కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా బ్యాట్స్ సెంటిమెంట్ అనుకుంటున్నారా? తమిళ దర్శకుడితో తెలుగు హీరో ఎవరైనా నటిస్తూ.. మన తెలుగులో ఆ సినిమా తీస్తే.. ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ( Can Pawan Kalyan and Ram Charan ) ఫెయిల్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ తమిళ డైరెక్టర్ మన తెలుగు హీరోతో తెలుగులో సినిమా డైరెక్షన్ చేసి.. సినిమా తీస్తే ఆ సినిమా కచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతూనే వస్తుంది. రీసెంట్ గా నాగచైతన్య సినిమా కస్టడీ కూడా దానికి పరాకాష్ట. ఈ సెంటిమెంట్ గురించి వాదించడానికి కూడా ఏమి కనిపించడం లేదు. ఒకప్పుడు తమిళనాడు డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీకి కలిసి వచ్చారేమో గానీ 15 సంవత్సరాల నుంచి తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలతో తెలుగులో చేసే సినిమాలు ఏ రూపంలో కూడా కలిసి రావడం లేదు. ఎంత భారీ బడ్జెట్లో తీసినా, ఎంత మంచి కథతో తీసినా.. ఎలా తీసిన బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడుకోవడం జరుగుతుంది.
ఇది కనిపెట్టిన తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు హీరోలు చాలామంది తమిళ డైరెక్టర్లతో కలిసి సినిమా చేసే అవకాశాలు వచ్చినా కూడా చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే ట్యాలెంట్ ని నమ్ముకోవాలి కానీ, ఇలాంటి సెంటిమెంట్స్ నమ్ముకోకూడదని, తమిళ డైరెక్టర్లతో సినిమా చేస్తే దరిద్రం పట్టుకుంటుంది అనే మాటనే తుడిచిపెట్టేయాలని, అటువంటి భయం ఎవరికీ ఉండకుండా చేయాలని మెగా హీరోలు ( Can Pawan Kalyan and Ram Charan ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిసైడ్ అయ్యారని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సముద్రఖని దర్శకత్వంలో వినోదం జీతం రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఈ స్టార్ హీరోలు ఇద్దరు కూడా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని, అలాంటి దరిద్రమైన సెంటిమెంట్ ని పక్కకు తోసేస్తారని అభిమానులు వాపోతున్నారు.
అయితే ఇలాంటి బాడ్ సెంటిమెంట్స్ ని గట్టిగా నమ్మే కొందరు నెటిజనులు.. ఇంత పక్కాగా 15 సంవత్సరాల నుంచి రుజువు అవుతుంటే.. ఇప్పుడు మొండిగా ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తమిళ దర్శకులతో సినిమా ఒప్పుకోవాల్సిన పనేంటి వీళ్లిద్దరికీ? వీళ్ళు ఒకే అంటే.. తెలుగు వాళ్ళు ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులు వచ్చి డైరెక్షన్ చేసేవాళ్ళు వస్తారు. అలాంటిది వీళ్లిద్దరు ఎందుకు అలా చేశారు అని కొందరు అంటుంటే.. హీరోఇజం అంటే సినిమాల్లో చూపించడం కాదు.. మా మెగా హీరోలు బయట కూడా హీరోయిజం చూపిస్తారు, హీరోలు లాదే ఆలోచిస్తారు. వాళ్ళ ట్యాలెంట్ మీదే వాళ్లకి నమ్మకం.. వాళ్ళు చేసే పని మీదే వాళ్లకి ధైర్యం.. అంతే తప్ప ఇలాంటి సెంటిమెంట్స్ ని నమ్ముకుని దేనికి దూరం కారు, ఎవరిని బాధ పెట్టరు అదే మా హీరోల గొప్పతనం అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బడ్జెట్ కంటే ఎంత ఎక్కువ తీసుకొస్తాయో లేదా తక్కువ తీసుకొస్తాయా ఏం జరుగుతుందనేది అవి రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది. ఒకవేళ రిజల్ట్ బాగా వస్తే నిజంగానే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఆ దరిద్రాన్ని పక్కకు తోసేసారని ధైర్యంగా చెప్పుకోవచ్చు..