BRO Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల్లో అటు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఒకపక్క ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం విపరీతంగా తిరుగుతూ ప్రచారాలు ( BRO movie stopped in two theatres ) సభలు పెడుతూ ప్రచారాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కడికక్కడ ఆయన అదిరిపోయే పంచ్ స్పీచ్ లు ఇస్తున్న సంగతి అర్థం అవుతుంది. అయితే ఇలాంటి తరుణంలో ఆయన సినిమాలు గురించి కూడా అభిమానులు ఎక్కువగా ఆశగానే ఎదురుచూస్తున్నారు. అలా అభిమానుల్ని ఆనందింప చేయడం కోసం జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బ్రో రిలీజ్ అయింది.
ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతమైన అంచనాలతో ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో.. శుక్రవారం నాడు ఈ సినిమా ధియేటర్ లోకి వచ్చి అందర్నీ కనువిందు చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనే మాటకొస్తే పవన్ కళ్యాణ్ ( BRO movie stopped in two theatres ) అభిమానులకైతే మాత్రం సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వాళ్ళు.. వాళ్ళ హీరోని ఎలా చూడాలనుకుంటారో అలా చూసామని ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ వింటూ అదిరిపోయే లెవెల్ లో విజిల్స్ వేస్తూ ఊగిపోతున్నారు. మరోపక్క ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లో పాటలు చూపించినప్పుడు ఇక కుర్చీలోంచి లేచి గెంతులే గెంతులు అభిమానులు.
సినిమా కలెక్షన్ దగ్గరికి వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక శని, ఆదివారాలు సెలవులు కాబట్టి ఈ రెండు రోజులు కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ చూసి దాన్ని బట్టి సినిమా మిక్స్డ్ టాకా.. బ్లాక్ బస్టర్ అనేది అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఒక ( BRO movie stopped in two theatres ) అలజడి మొదలవుతుంది.ఎక్కడికక్కడ ఏదో ఒక రకమైన సంచలనం క్రియేట్ అవుతుంది. అలాగే కావలిలోని లతా థియేటర్ దగ్గర బ్రో సినిమా వేసే పరిస్థితుల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. సౌండ్ సిస్టం, ఏసీలు ఫెయిల్ అవ్వడంతో యాజమాన్యం పవన్ కళ్యాణ్ బ్రో సినిమాను ఆపేసింది. దానితో ఆందోళనకు గురైన అభిమానులు యాజమాన్యంతో విపరీతంగా గొడవలు పడ్డారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస లో కూడా శ్రీదేవి థియేటర్లో బ్రో బెనిఫిట్ షో వేస్తామని చెప్పి వేయలేకపోయారు. అభిమానులు గొడవ మొదలుపెట్టారు. అయితే పలు సాంకేతిక కారణాలతో షో ఆగిపోగా.. ఉదయం నుంచి షో వేయకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నేతలు ఆందోళన దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. థియేటర్ యాజమాన్యానికి ఏం చేయాలో అర్థం కాక పోలీసుల్ని ఆశ్రయించి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇలా కావాలి, ఆముదాలవలసల్లో బ్రో సినిమా షో నిలిపివేగా.. ఇంకొక వైపు గూడూరు పట్టణంలో సంగం థియేటర్లో మూవీ ఫ్లెక్సీ గురించి గొడవలు పడ్డారు. మళ్ళీ థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీని తెప్పించి నిలబెట్టారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా రెండు చోట్ల షో ఆగిపోగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నిచోట్ల నినాదాలు కూడా చేసారు..