Bro : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రో సినిమా రిలీజ్ కు ఇంకెన్నో గంటలు లేవు. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన ప్రమోషన్ అయ్యి.. ఎవరికి వారు సినిమా ఎలా ఉండబోతుంది అనేది అంచనాలను కూడా వేసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయింది. అయితే ( Bro Movie Distributors Review ) దీని మీద కూడా అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే నిమిషాల్లో బుకింగ్ అయిపోవాల్సింది పోయి.. ఇప్పుడు గంటల్లో బుకింగ్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ సినిమాకి మెయిన్ హీరో సాయిధరమ్ తేజ గా తీసుకుంటే చాలామంది అంత తొందరగా రియాక్ట్ అవ్వకపోవచ్చు.
బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ క్లియర్ గా నేను ఈ సినిమాలో ఎక్కువ సేపే ఉంటాను 80% ఉంటానని చెప్పడం జరిగింది. దానితో కొంత వరకు అందరికీ ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. అయితే ఈ సినిమా ఎలా ( Bro Movie Distributors Review ) ఉంటుంది ఎలా, ఉంటుంది అని ఆత్రం పడుతుంటే.. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ సినిమా చూశారని.. వాళ్ళ నుంచి సినిమా ఎలా ఉందో స్టోరీ రివ్యూ కూడా వచ్చేసింది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి.. ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటే.. మార్కండేయ అలియాస్ మార్క్ ( సాయిధరమ్ తేజ్ ) తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తాను తీసుకుని టైం తో పోటీ పడుతూ అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడట. కంపెనీ పనులు బాధ్యతల్లో ఉండి తన ప్రేమను కూడా నిర్లక్ష్యం చేస్తాడంట. ఆ తర్వాత ప్రేమించుకున్న అమ్మాయి నుంచి బ్రేకప్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందంట.
అలాంటి టైంలో సాయిధరమ్ తేజ్ చనిపోతాడంట. చనిపోయిన మరుక్షణం నా కుటుంబం ఏమైపోతుంది అనే బెంగలో ఉంటే.. అప్పుడు టైం ( పవన్ కళ్యాణ్ ) ఎంట్రీ ఇచ్చి.. నేను నీకు కొంత కాలాన్ని ఇస్తాను, వెనక్కి తీసుకెళ్తాను. కాకపోతే ( Bro Movie Distributors Review ) నేను నీ పక్కనే ఉంటాను. అని చెప్తాడంట. అయితే నాకు పర్వాలేదు నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని చక్కదిద్ది.. నా తమ్ముడికి బిజినెస్ అప్పచెప్పి.. నా చెల్లెలి భవిష్యత్తు చూసి వచ్చేస్తాను అని చెప్తాడంట. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ పక్కనే ఉండి అన్ని చూపించే తరుణంలో సెకండ్ హాఫ్ సినిమా ఫ్యామిలీ అటాచ్మెంట్ గా ఉంటుందంట. సెకండ్ హాఫ్ లో అనేక పరిణామాలు జరుగుతాయంట.
అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గెటప్స్ లో లో కనబడి మంచి జోష్ తీసుకొచ్చేలా ఉంటుందంట. క్లైమాక్స్ వరిజినల్ సినిమాలా కాకుండా వీళ్ళు డిఫరెంట్ గా తీశారంట. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించగా.. తమిళ్ సినిమా ‘వినోదయ సీతమ్’ రీమేక్ చేసారు. ఏది ఏమైనా సినిమా యావరేజ్ యావరేజ్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఆనియన్స్ బాగా కనెక్ట్ అయితే ఎక్కడో ఒకచోట మంచి క్లిక్ అవ్వచ్చని అంటున్నారు. ఏదైనా బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ అన్నిటికి సమాధానం చెప్తుంది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో వరదలతో టైం లో కాలం కూడా ఈ సినిమాని కనికరించడం లేదా అని మరికొందరు అనుకుంటున్నారు.