Brahmaji : బ్రహ్మాజీ అంటే ఎవరో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమీడియన్గా, విలన్ గా ఎన్నో మంచి మంచి పాత్రలను పోషించిన మంచి నటుడు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ ప్రతి పాత్రలోనూ ఇమిడిపోయి తన పాత్రకి తాను చక్కగా న్యాయం చేయగలిగే మంచి నటుడు. ఆయన ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ( Brahmaji son married a dog ) జరిగింది. ఆమెకు బ్రహ్మాజీతో రెండో పెళ్లి.. మొదటి భర్తతో విడాకులు తీసుకోగా.. ఆమెకు మొదటి భర్తకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. బ్రహ్మాజీ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆమె కొడుకుకి అన్యాయం జరగకూడదని బ్రహ్మాజీ ఇక పిల్లలను కనడం మానేసి కూడా ఆ కొడుకుని తన కొడుకుగా పెంచుకున్న గొప్ప మనసున్న వ్యక్తి. సినిమాల్లో హీరో కాకపోయినా కూడా రియల్ లైఫ్ లో హీరో లాంటి పని చేశాడు.
అలాగే తన కొడుకుని సినిమా రంగంలోకి కూడా తీసుకొని వచ్చాడు. మొదటి సినిమా పిట్ట కథ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్ కొట్టాడు. అలాగే ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు కెరీర్ కోసం అతను సినిమాల్లో నటించేందుకు ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే బ్రహ్మాజీ కొడుక్కి కుక్కని ఇచ్చి పెళ్లి చేశారంట.. దాంతో బ్రహ్మాజీ కోర్టుకెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ బ్రహ్మాజీ కొడుకు నిజంగా కుక్క ను ఇచ్చి పెళ్లి చేస్తారు ( Brahmaji son married a dog ) అనుకుంటున్నారా ఏంటి? నిజం కాదు. ఇది స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా లో బ్రహ్మాజీ కొడుకు నటిస్తుండగా.. ఆ సినిమా టీజర్ ని బయటకు వదిలారు. ఆ సినిమా లో బ్రహ్మాజీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తన జాతకంలో ఏదో లోపం ఉందని.. పెళ్లి చేసుకుంటే దోషమని.. ముందుగా ఎవరినైనా పెళ్లి చేసుకుని ఆ తర్వాత అమ్మాయిని చేసుకోవచ్చని జ్యోతిష్యుడు చెప్తాడు.
దీంతో బ్రహ్మాజీ కొడుకు ఒక కుక్కని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఇక దోషం పోయిందని, హీరోయిన్ ని పెళ్లి చేసుకునే క్రమంలో తాళికట్టే టైంకి ఆపండి అనుకుంటూ ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి కుక్కని పెంచుకున్న యజమాని. మొదటి భార్య ఉంటుండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడని గొడవ పెడతాడు. దీని మీద ( Brahmaji son married a dog ) వీళ్ళు కోర్టుకెళ్తారు. అక్కడ హీరో తరఫున బ్రహ్మాజీ లాయర్ గా.. కుక్క తరఫున సప్తగిరి లాయర్ గా నటిస్తాడు. కుక్క విడాకులు ఇవ్వాలి అంటే 20 లక్షలు భరణంగా ఇవ్వాలని కుక్క తరఫునుంచి వాదన కేసు పెడతారు. కుక్క విడాకులు ఇవ్వడానికి 20 లక్షల అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతకీ కుక్కతో పెళ్లి.. కుక్కకు పైగా విడాకులు ఇవ్వాలంటే భరణం..
ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు సినిమా తీస్తున్నాడు. ఇక ఇలాంటి కాన్సెప్ట్ ఆడియన్స్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారు? ఏమి రిజల్ట్ వస్తుందనేది చూడాలి. ట్రైలర్ చూస్తే మాత్రం కామెడీగానే ఉంది. అన్ని రకాలు పండించేటట్టే ఉన్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందని తెలియదు కానీ.. ఇది ఒక కొత్త కాన్సెప్ట్.. ఈ రకంగా బ్రహ్మాజీ కొడుకు కుక్కని పెళ్లి చేసుకున్న ఈ ట్రైలర్ చూసి అందరూ తెగ నవ్వుతున్నారు. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతదో? ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పలేకపోతున్నాము. ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగులుతున్నాయి. అలాంటి సినిమా ఒకటి వస్తుందని కూడా పెద్దగా తెలియని సినిమాలు కూడా సడన్గా హిట్ అయిపోతున్నాయి. సో జడ్జ్మెంట్ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మూడ్ ని బట్టి ఉంటుంది.