Rashmika : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రష్మిక ఎక్కడికో వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఇటీవల రిలీజైన అనిమల్ సినిమాతో ఆమెపై క్రేజ్ ఎక్కడికి వెళ్ళిందో కూడా ఊహించనంత స్థాయికి వెళ్ళిపోయింది. రష్మిక మందన ( Rashmika and Bollywood Megastar ) అనిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుతంగా లీనమైపోయి నటించింది. ఇక అనిమల్ లాంటి ఒక వ్యక్తి మెంటాలిటీని తట్టుకోగలిగే భార్య అంటే.. గీతాంజలి లాగే ఉండాలేమో అని అనిపించేలా ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర పై కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఆమె పాత్రను మాత్రం అంతగా నెగిటివ్‌గా చెప్పడానికి కూడా ఆమె అందులో అంత లీనమైందనే చెప్పుకోవాలి అని.. నటిగా ఆమె 100% న్యాయం చేసిందని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షో లో రష్మిక మందన గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రాం లో రీసెంట్ ఎపిసోడ్లో మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ భాస్కర్ అనే ( Rashmika and Bollywood Megastar ) కంటెస్టెంట్ గేమ్ ఆడాడు. గేమ్‌లో భాగంగా ప్రమోద్ సర్ మీరు నా హాబీస్ గురించి అడగలేదు అంటూ అమితాబ్‌ని అడిగాడు. దీంతో అమితాబ్ నీ హాబీస్ ఏంటి అని అడిగాడు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సినిమాలంటే ఇష్టం. ముఖ్యంగా సౌత్ సినిమాలంటే చాలా ఇష్టం. అందులోనూ రష్మిక అంటే ఇంకా ఇష్టం. ఆమెను విపరీతంగా ఇష్టపడే ఫ్యాన్ నేను అని చెప్పాడు.
ఆమె నటించిన ప్రతి సినిమాని నేను చూస్తాను. ఆమెకు సంబంధించిన ప్రతిదీ నాకు గుర్తుంటుంది. ఆమె మొదటి సినిమా 2016లో కిరాక్ పార్టీ రిలీజ్ అయింది అని చెప్పాడు. అప్పటి నుంచి ఆమెకు నేను అభిమానిగా మారాను.ఇంకా ( Rashmika and Bollywood Megastar ) ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్తాను. నేను రష్మిక కి సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అయ్యాను. నేను మూడుసార్లు ఆమె నాకు రిప్లై కూడా ఇచ్చింది అని చెప్పాడు. ఒకసారి ఆమెకు నేను ప్రపోజ్ కూడా చేశాను అని చెప్పాడు. రష్మిక అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. దానికి అమితాబ్ ఈ మధ్య మీరు రష్మితో మాట్లాడారా అని అడిగాడు.
లేదు సార్ ఆమె సినిమాలతో, సినిమాల ప్రమోషన్ తో చాలా బిజీగా ఉంది.ఆమెతో నేను ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు అని చెప్పాడు. దాంతో అమితాబ్ అక్కడికక్కడే రష్మికకి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. నిన్ను ఎంతో పిచ్చిగా ఇష్టపడి ప్రేమిస్తున్న అభిమాని ఇక్కడ ఉన్నాడు. అతనితో ఒకసారి మాట్లాడు అని చెప్పాడు. దాంతో ఆ కంటెస్టెంట్ రష్మికని చూసి ఆనందంతో పొంగిపోయాడు. మీరంటే నాకు ఇష్టం మేడం, మిమ్మల్ని ఇలా చూడడం నిజంగా నా అదృష్టం అని చెప్పాడు రష్మిక అతనితో మీరు చాలా బాగా ఆడుతున్నారు నాకు కూడా మిమ్మల్ని చూడ్డం చాలా ఆనందంగా ఉంది.అప్పుడు రష్మిక.. నేను తప్పకుండా మిమ్మల్ని స్వయంగా ఒకసారి కలుస్తాను అని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పింది. దాని తర్వాత అమితాబ్.. రష్మికకు థాంక్స్ చెప్పి.. అనిమల్ సినిమా చూశాను.. అందులో నీ పాత్ర అద్భుతం.. గీతాంజలిగా అదరగొట్టావు.. దీని గురించి మనిద్దరం ఒకసారి కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పుకొచ్చాడు. అలా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ రష్మికని ఎంతో ఇష్టపడుతున్న ఒక వ్యక్తితో మాట్లాడించడం అందరికీ ఆనందాన్ని కలిగించింది.