భానుప్రియ అంటే తెలియని వారు ఉండరు. ఆమె పెద్ద కళ్ళు, నటన, నాట్యం అన్నిటితో స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలింది. అందరి స్టార్ హీరోల సరసన నటించింది. భానుప్రియ అనగానే మొదట సితార సినిమా గుర్తుకు వస్తుంది. సితార సినిమాలో ఆమె అమాయక, నిస్సహాయత,ప్రతిభ,ఆవేశం,కోపం,పట్టుదల ఇన్ని కలగలిపి ఉన్న క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా నటించి,సినిమాకి ఎన్నో అవార్డ్స్ వచ్చేంత హిట్ కొట్టించింది.
భానుప్రియ డాన్స్ గురించి చెప్పాలంటే.. ఒక్క భరతనాట్యంలోనే కాదు బ్రేక్ డాన్స్ కూడా చాలా బాగా వేసేది. చిరంజీవి సరసన ఎంత స్టార్ హీరోయిన్ డాన్స్ చేసినా.. ఆయనతో పోటీ పడలేకపోయేవారు. కానీ భానుప్రియ మాత్రం చిరంజీవికి సరి సమానంగా డాన్స్ వేయగలిగేది. ఇక క్లాసికల్ డాన్స్ విషయానికి వస్తే, ఆమె నాట్యమే కాదు, ఆమె రూపు రేఖలు కూడా ఆ నాట్యం కోసమే ఆ దేవుడు పుట్టించాడు అన్నట్టు ఉంటుంది.
భానుప్రియ నాట్యం చూసి, ఆ రోజుల్లో ఎందరో అమ్మాయిలకు నాట్యం నేర్చుకోవాలనే ఇంటరెస్ట్ వచ్చింది. స్వర్ణకమలంలో ఆమె నటన, నాట్యం రెండూ ప్రేక్షకులు ఇంతవరకు మరచిపోలేకపోతున్నారు. భానుప్రియ పెళ్లి తరవాత సినిమాలకు కొంతకాలం దూరం అయ్యారు. ఆ తర్వాత మల్లి సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె అనేక విషయాలు చెబుతూ .. ఆమెకు నయం కానీ జబ్బు ఒకటి వచ్చిందని చెప్పారు.
భానుప్రియకు మతిపరపు జబ్బు వచ్చిందట. ఓ ముద్ర చూసి అది దేనికి సంబంధించినది.. అని చెప్పడం కూడా ఆమెకు కష్టంగా ఉందట. డాన్స్ అయితే పూర్తిగా మరచిపోయి, డాన్స్ స్కూల్ కూడా మూసేశారంట. నా భర్త చనిపోయిన తరవాత నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది అని భానుప్రియ చాలా బాధపడుతూ.. ఒక సామాన్య స్త్రీలా చెప్పుకుంటూ వచ్చారు. భర్తమీద బెంగతో చివరికి హెల్త్ పాడుచేసుకుని నాట్యం కూడా మరచిపోవడం ఆమె అభిమానులకు షాకింగ్ గా మరియు చాలా బాధగా ఉంది.