Bandla Ganesh: బండ్ల గణేష్ అంటే ఒక కమెడియన్ గా, ఒక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతోమందికి తెలుసు. ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహితుడని, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రాణమని, పవన్ కళ్యాణ్ ని దేవర ( Bandla Ganesh comments on Pawan ) అని పిలుస్తాడని కూడా అందరికీ తెలుసు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు పొగుడుతూనే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పారని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బండ్ల గణేష్ సినిమాల్లో నే కాకుండా ప్రొడక్షన్ లైన్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు అందరితోనే కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాడు.
గత కొంతకాలంగా కొంచెం సైలెంట్ గా ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్లీ హుషారుగా మారారు. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సాధించిన విజయం గురించి ఆయన ఎంతో పొగడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అదిరిపోయే విజయాన్ని తెలంగాణలో అందుకుందని, నిజంగా ( Bandla Ganesh comments on Pawan ) రేవంత్ రెడ్డి గొప్పతనం అని కొనియాడాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఏమైనా తన తండ్రి రాజకీయమా, తాత రాజకీయమా.. అయినా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడా? లేదు.. కానీ అతని మీద శ్రమ ఆధారపడి, అతని పట్టుదలతో ఈరోజు తెలంగాణ సీఎం పొజీషన్ కి పోటీ పడుతున్నారు అని అన్నాడు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత.. బండ్ల గణేష్.. కేసీఆర్ పై కేటీఆర్ పై అనేక సెటైర్లు వేస్తున్నారు. అలాగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారంట. కేవలం పవన్ కళ్యాణ్ మీద బాధతోనే చెబుతున్నాను అంటూ.. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటేనే బాగుండేదని ఆయన చెప్పకు వచ్చాడు. ఆయన నేను ( Bandla Ganesh comments on Pawan ) ఎక్కడో చూడాలనుకున్నాను.. ఆయన స్థాయి వేరు.. కానీ ఆయన ఇక్కడే ఉంటున్నారు అంటూ కామెంట్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ ని రేవంత్ రెడ్డి తో పోలుస్తూ.. రేవంత్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకపోయినా కూడా, తాత ముత్తాతలు పొలిటిషన్ కాకపోయినా కూడా.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయ్యే స్థాయికి ఎదిగారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తే ఇలాగే చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడూ తనకు ప్రాణం అని, దేవుడని, దేవరా అని బండ్ల గణేష్ చెప్పాడు. గాని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాత్రం బండ్ల గణేష్ ఎప్పుడు వెళ్లలేదు. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. అంతేకాదు తను ఎప్పటికైనా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి దీన్ని బట్టి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గ్రోత్ కోరుకుంటున్నాడు అన్న విషయం అర్థం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కి యాంటీగా కామెంట్స్ చేసినట్టే అని మరికొందరికి అర్థం అవుతుంది. ఏదేమైనా మరి నెక్స్ట్ ఆంధ్ర ఎన్నికలు ఎలా ఉంటాయో చూడాలి. అలాగే ఆంధ్ర ఎన్నికలు అయిపోయిన తరవాత పవన్ కళ్యాణ్ తన బాలన్స్ సినిమాలు కంప్లీట్ చేస్తాడని అంటున్నారు..