Home Cinema Balakrishna: అదేంది బాలయ్య.. ఎంత నీకు కలిసొచ్చిన హీరోయిన్ అయితే మాత్రం అంత వైరల్ అవుతావా?

Balakrishna: అదేంది బాలయ్య.. ఎంత నీకు కలిసొచ్చిన హీరోయిన్ అయితే మాత్రం అంత వైరల్ అవుతావా?

నందమూరి బాలకృష్ణ అంటే ఒక సింహం అని అంటారు. బాలయ్య సినిమా అంటే ఇప్పటికీ, ఒకరకమైన క్రేజ్ ఉంటాది. యువ హీరోలతో పోటీపడేలా ఆయన సినిమాల్లో మాస్ అరుపులు ఉంటాయి. జై బాలయ్య అంటూ థియేటర్లను ఆయన అభిమానులు హడావిడి చేస్తారు. బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్స్ కూడా మంచి పేరు వస్తాది. ఎందుకంటే ఆయన సినిమాలో హీరోయిన్ కి కూడా మంచి ప్రాధాన్యత ఉంటాది.

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌చ్చిన `అఖండ‌` మూవీలో హీరోయిన్ గా చేసిన ప్రగ్యా జైస్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కంచె సినిమాతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఈమెకు మంచి పేరు వచ్చింది. చూడటానికి అందంగా, మంచి డీసెంట్ నటనతో ఆ సినిమాలో ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత ఆమెకి ఆఫర్స్ బాగానే వచ్చాయి కానీ పెద్ద సక్సెస్ అయితే కనబడలేదు.

See also  Niveda Thomas: ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి నివదితా థామస్ వెళ్ళడానికి అసలు కారణం ఇదేనా.?

అయితే 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లైన అఖండ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులో బాలయ్య తో పాటు ప్రగ్యా జైస్వాల్ కు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో ఈమె తలరాత మారిపోయింది అనుకున్నారు. కానీ ఏమి మారలేదు, అక్కడ నుంచి కూడా ఆమెకు సినిమాలు లేవు. అసలే ఆమెకు ఏ సినిమా కూడా హిట్ కాక, ఐరన్ లెగ్ అని పేరు వచ్చింది. అఖండా తో ఆ పేరు పోయి, హిట్స్ కొడాతాది అనుకుంటే అయినా మారలేదు.

See also  Anushka - Samantha : అనుష్క సమంతల గురించి పచ్చి నిజాలు బయట పడ్డాయి..

అయితే ఈ హీరోయిన్, బాలయ్యకు మాత్రం కలసి వచ్చిందని అనుకునేవారు. కానీ ఇప్పుడు బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ కలసి ఉన్నఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక యాడ్ కోసం పెళ్లి పీటలమీద కూర్చున్న ఈ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అదేంది బాలయ్య.. ఎంత నీకు కలిసొచ్చిన హీరోయిన్ అయితే మాత్రం అంత వైరల్ అవుతావా అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు..