Home Cinema Balagam : బలగం సినిమా దానికి పోటీ.. ఇక వీళ్ళ సంగతి ఏమిటి?

Balagam : బలగం సినిమా దానికి పోటీ.. ఇక వీళ్ళ సంగతి ఏమిటి?

balagam-movie-in-the-race-of-oscar-award-nomination-list

Balagam : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటీవల కాలంలో చాలా ముందుకు వెళుతుంది. పూర్వం భారతదేశం నుంచి ప్రపంచానికి కనిపించే కనీస సినిమా రంగం అంటే బాలీవుడ్ రంగమే కనబడింది. అలాంటిది ఇప్పుడు ఎక్కడెక్కడ వారు ఒక్కసారి తెలుగువారి వైపు తొంగి చూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు చాలా డిమాండ్ పెరిగింది. అలాగే టెక్నీషియన్స్ కు అందరికీ కూడా పెరిగింది ( Balagam movie in the race of Oscar ) దానికి కారణం సినిమా రంగం అందుకుంటున్న ఒక్కొక్క ఘనవిజయలే బాహుబలి సినిమా నుంచి ఒక రేంజ్కి పరిగెట్టడం ప్రారంభించిన తెలుగు సినిమా రంగం. ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచానికి చేయి ఎత్తి చూపించింది.

Oscar-Balagam-movie-news

ప్రపంచానికి నేనున్నానంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ చూపించడం ఆపలేదు. ఆ ఉత్సాహంతో ఇక ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఉంది. అయితే ఈసారి ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేసే సినిమాలన్నీ చూస్తే.. పెద్ద పెద్ద సినిమాలు కనిపించడం లేదు. చిన్న చిన్న సినిమాలు ఆ బరిలో నిలబడుతున్నాయి. భారతదేశ నుంచి సినిమాలను ( Balagam movie in the race of Oscar ) ఆస్కార్ కి నామినేషన్ కి పంపించాలని.. మేకర్స్ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. భారతదేశ నుంచి గుజరాతి సినిమా చెల్లో అనే సినిమాని ఆస్కార్ కి అధికారకంగా పంపారు కానీ.. ఆ సినిమా కి అవార్డు లభించలేదు. డాక్యుమెంటరీ విభాగంలో ఎలిఫెంట్ విస్పర్స్ అనే సినిమాకు మాత్రమే లభించింది. ఇక 2024 సంవత్సరం గాను ఆస్కార్ కి ఏ సినిమా అధికారం గా పంపాలి అనే విషయంలో ప్రక్రియ మొదలుపెట్టారు.

See also  Chiranjeevi - Ram Charan : మెగా ప్రిన్సెస్ కోసం చిరు చరణ్ లు రహస్యంగా.. ఉపాసన ఊరుకుందా?

Oscar-Balagam-movie

దీనికి 17 మంది సభ్యులు ఒక కమిటీగా రూపొంది.. వాళ్ళు ఏ సినిమాల్ని భారతదేశం నుంచి ఆస్కార్ కి నామినేషన్ కి పంపించాలని ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా 22 సినిమాలను ఆస్కార్ నామినేషన్ పంపడానికి సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆస్కార్ కోసం రికమండ్ చేసే సినిమాల లిస్ట్ చూస్తే అందులో పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేకుండా.. చిన్న చిన్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంట. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగించే విషయమే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే బలగం, దసరా రెండు సినిమాలు ఆస్కార్ కి పంపడానికి పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక హిందీ నుంచి ( Balagam movie in the race of Oscar ) ఇతర భాషల నుంచి అనేక సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాని చూసి హృదయం స్పందించని వాళ్లంటూ ఒక్కరు కూడా లేరు. ఒక మనిషి ప్రాణానికి ఇంత విలువ ఉందా? ఒక కుటుంబ పెద్దకి అంత గౌరవం ఉందా> రక్తసంబంధీకులు ఒకళ్ళ మీద ఒక ఆప్యాయత ఉంటుందా? ఇలా కలిసి పెరుగుతారా? ఇలాంటి మనస్తత్వం ఉండాలా? అనే విషయాలను కూడా గమనించని ఈ జనరేషన్ కి ఇంత బాగా అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు వేణు.

See also  Custody: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సారి హిట్ కొట్టడానికి ఫుల్ జోష్ మీద వస్తున్నాడు చైతు

Oscar-Balagam-movie-latest

నిజంగా ఆస్కార్బరిలోకి పోటీ పడడానికి ఈ సినిమాలు వెళ్తున్నందుకు గర్వించాలి అవార్డును సాధించుకుని వస్తాయా లేదా తెలియదు గానీ అక్కడి వరకు వెళ్తే అది కూడా ఒక ఘనత. 22 సినిమాల్ని కమిటీ చూసి అందులో ఒక సినిమా సెలెక్ట్ చేస్తారట. 22 సినిమాల్లో మన తెలుగు సినిమాలు రెండు ఉండడం అందులో బలగం, దసరా ఉండడం నిజంగా ఆనందకరం. కాకపోతే విపరీతమైన బడ్జెట్ లు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ని పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి? ఒకపక్క డిజాస్టర్ గా మిగిలిన డబ్బులు రాకుండా నానా కష్టాలు పడుతుంటే.. మరోపక్క అవార్డు వచ్చే విధంగా కూడా.. అలాంటి నామినేషన్ కూడా వెళ్లే అర్హతను సాధించుకోకపోతే.. వాళ్ళు ఎంత బాధ పడతారు అని నిటిజనూలు అనుకుంటున్నారు. నిజమే ఇలాంటి సిట్యుయేషన్ చూసైనా ఆలోచన విధానం మారాలి. ఎంత హై బడ్జెట్ లో తీస్తే సినిమా అంత గొప్ప కాదు.. ఎంత హై క్వాలిటీ తో తీస్తే సినిమా అంత గొప్ప.. ఎంత ప్రేక్షకుడి మనసును టచ్ చేస్తే అంత గొప్ప అని తెలుసుకొని.. ఇప్పటికైనా మారితే.. అనవసరంగా డబ్బు పోకుండా ఎక్కువగా లాభాలు బాట పడుతుంది ఇండస్ట్రీ అని నెటిజనులు అనుకుంటున్నారు.

See also  Prabhas: ఓం రౌత్ పై ప్రభాస్ ఫన్నీ కామెంట్స్.. ట్రైలర్ నచ్చకపోతే రూమ్ కి తీస్కపోతా..