Balagam movie Awards : బలగం అతి తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలతో ఏమి తీసిపోకుండా.. సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, దానితో పాటు కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. సినిమాకి ( Balagam movie get international award also ) మంచి పేరు కలెక్షన్స్ మాత్రమే కాకుండా అవార్డ్స్ వర్షం కూడా బాగానే కురిపిస్తుంది. కుటుంబంలో ఎవరితో ఎలాంటి బంధాలు ఉండాలి? వాటిని ఎలా కాపాడుకోవాలి లేదా చిన్న చిన్న తప్పుల వలన ఎన్ని సంవత్సరాలు ఎంత అనుబంధాన్ని మిస్ అయిపోతాము ఇలాంటివన్నీ చాలా బాగా చూపించడంతో పాటు.. ఒక ముఖ్యమైన విషయం మాత్రం బాగా చూపించాడు.
అదేమిటంటే.. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిన తరవాత జరిగే పరిణామాలు అన్ని చూపిస్తూ.. చనిపోయిన తల్లితండ్రులు ఏమి కోరుకుంటారో అద్భుతంగా చూపించాడు. అందుకే ఈ సినిమాని థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో కూడా చాలా మంచి రేంజ్ లో దూసుకుపోతుంది. అంతే కాకూండా ఈ సినిమాకి ( Balagam movie get international award also ) ఇప్పటికే అనేక అవార్డ్స్ వచ్చాయి. బలగం చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్‌ఫిల్మ్ టోగ్రఫీ విభాగాల్లో లాస్‌ఏంజిల్స్ టోగ్రఫీ అవార్డులు వచ్చాయి. వీటితో పాటు ఉగాది పురస్కారాల నంది అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చింది.
ఇప్పటివరకు లోకల్ గా బలగం సినిమా ఇన్ని అవార్డ్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా.. ఇప్పుడు అంతర్జాతీయ లెవల్లో మరొక పెద్ద అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్ కి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో ఇండియా నుంచి బెస్ట్ ఫీచర్ చిత్రంగా ‘బలగం’ సినిమా అవార్డు ని అందుకుంది. ఈ సినిమాకి అంతర్జాతీయ అవార్డు వచ్చిన సందర్బంగా, ఈ సినిమా దర్శకుడు వేణు తన ఆనందాన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకూండా ఈ సినిమా ఇంత విజయం సాధించి, ఈరోజు అంతర్జాతీయ అవార్డు అందుకోవడాని తన టీమ్ కారణమని చెప్పి.. వారికీ కృతజ్ఞత చెప్పాడు.
ఇప్పటికే బలగం సినిమా నాలుగు అవార్డ్స్ అందుకున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని వేణు చెప్పాడు. అలాగే వీటితో పాటు అంతర్జాతీయ అవార్డు దొరకటం ఇంకా ఆనందంగా ఉందంటూ దానికి కారణమైన తన టీం కి అభినందనలు తెలియజేశాడు. ఒక చిన్న కథతో, చిన్న పాయింట్ తో ప్రేక్షకుడి ఇష్టాన్ని, అభిరుచిని అర్ధం చేసుకుంటే సినిమా హిట్ అవ్వడం ఖాయమని దర్శకుడు వేణు నిరూపించాడు. తెలుగు సినీ అభిమానులు కూడా మేము కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, ఇలా మానవత్వాన్ని నిలబెట్టే మంచి సినిమాలను కూడా ఆదరిస్తామని నిరూపించారు.