Ram Skanda: మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకించి ప్రత్యేకంగా మనసులో ఉన్న విషయాన్ని దాచుకోకుండా బయటకు చెప్పే హీరోలు చాలా తక్కువ. మంది ఇక మరికొందరైతే మనసులో ఒకటి ఉంచుకొని పైకి మరొక లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కానీ ఉన్నది ఉన్నట్లు ఆ సిచువేషన్ ఆ పరిస్థితి ఎలాంటిదైనా సరే తన మనసులో ఏది ఉంటే ఆ మాట అనేస్తాడు. అవతలి వారు ఎంత పెద్ద అయినా సరే ఎంత చిన్న అయినా సరే.. తన మనసులో ఏది అనాలనిపిస్తే అది అనేస్తాడు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తాడు. అలాంటి విషయంలో మొదటి ప్లేస్ లో ఉంటాడు నందమూరి బాలకృష్ణ. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు కూడా..
అయితే ఇటీవలే రామ్ నటించిన స్కంద చిత్రం యొక్క ఈవెంట్ సందర్భంగా బాలయ్య ఇందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే కొంచెం మరింత డోస్ పెంచి తన దైన శైలిలో తన దైన పర్ఫామెన్స్ తో స్పీచ్ ఇచ్చి అదరగొట్టాడు బాలయ్య. కాగా హీరో రామ్ పోతినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం (Ram Skanda) స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం కి సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా నరసింహం బాలకృష్ణ రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ.. రామ్ ను ఎంతో ఎత్తుకు ఎదిగేలా తెగ పొగిడేసారు. ఈవెంట్ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..
రామ్ పోతినేని గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే అని చెప్పాలి. ఈ స్మార్ట్ శంకర్ తో తెలంగాణ యాసలో అదరగొట్టి నాకు సవాల్ విసిరాడు. ఇప్పుడు నేను అందుకు ప్రతి సవాల్ గా భగవంత్ కేసరితో ప్రతి సవాల్ విసురుతున్నాను. మళ్లీ ఆయన డబుల్ ఇస్మార్ట్ అంటూ నాకు సవాల్ విసిరుతున్నారు. ఇలాంటి విషయంలో ఆయనది పీహెచ్డీ అయిపోయింది. నేను మాత్రం ఇంకా డిగ్రీ స్థాయిలోనే ఉన్నాను. ఆయనను చూసి నేను ఫాలో అవ్వాలంటూ చాలా ఫన్నీగా రామ్ పోతినేని పై కామెంట్ చేయగా.. అందుకు రామ్ కూడా ప్రతి సమాధానంగా.. నేను చదివే స్కూల్లో మీరు పిహెచ్డి మాస్టారు సార్ అంటూ చెప్పుకో వస్తాడు. దీంతో బాలయ్య ఉప్పొంగి పోతూ ఉంటాడు. అనంతరం మళ్లీ బాలయ్య మాట్లాడుతూ.. రామ్ మహతిక్క అంటూ టాప్ సీక్రెట్ ని వెల్లడించాడు.
2006 వ సంవత్సరంలో ఆయన సినీ కెరియర్ మొదలెట్టగా ఆయన నటించిన తొలి చిత్రానికి కూడా నేనే గెస్ట్ గా వెళ్లానని.. అలా ఆయన మొదలుపెట్టిన జర్నీ నుండి ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేస్తూ వచ్చాడని.. సినిమా ఇండస్ట్రీకి రామ్ లాంటి హీరోలు కావాలంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య. పైగా అంతటితో ఆగకుండా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి శ్రీ లీలను తెగ పొగిడేశారు. అందంతో పాటు నటన అభినయం కలిగిన అమ్మాయి మన శ్రీ లీల అని పైగా మన తెలుగు అమ్మాయి కావడం మరింత గర్వకారణంగా ఉందంటూ ఈ ఈవెంట్ భాగంగా తెలియజేశాడు. శ్రీ లీలకి కచ్చితంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి పక్కా వెళ్తుందంటూ భరోసా కూడా ఇస్తూ ధీమా వ్యక్తం చేశాడు బాలకృష్ణ. దాంతో ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.