Home Cinema Bala Krishna: భగవత్ కేసరి నుండి బాలయ్య క్రేజీ లుక్ లీక్. బుల్లెట్ బండి పై...

Bala Krishna: భగవత్ కేసరి నుండి బాలయ్య క్రేజీ లుక్ లీక్. బుల్లెట్ బండి పై స్టన్నింగ్ యాక్షన్ ఛేజ్..

Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా తెలియాల్సింది లేదు. నందమూరి ఇంటి పేరు అంటే మనందరికీ సుపరిచితమే. ఇక ఆయన ఈ మధ్యన నటించి చిత్రాలు బ్లాక్ బాస్టర్ గా హిట్టయ్యాయి. అందులో మరీ ముఖ్యంగా అఖండ చిత్రమైతే పాన్ ఇండియా లెవల్లో సంచలనాలు సృష్టించింది. ఆ చిత్రంతో బాలయ్య బాబుకి బాలీవుడ్ లో సైతం గొప్ప పేరు తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bala Krishna New Movie)చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించబోతున్నాడు.

bala-krishna-new-movie-bhagavath-kesari-updates

ఇక ఈ చిత్రం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్నది. ఐతే ఇటీవలే బాలయ్య బాబు పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా నందమూరి అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. నిత్యం ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఒక్కొక్కటిగా విడుదల అవుతుండడంతో.. ఫిల్మ్ నగర్ మొత్తం బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి (Bala Krishna New Movie) చిత్రం పేరు మార్మోగిపోతుంది. ఇక ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పిక్ లీక్ అయ్యి సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది.

See also  Akkineni Nagarjuna : నాగార్జున మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణం ఇదంట.. మరి ఆమె ఇప్పుడు నాగచైతన్యని ఏంచేస్తాది?

bala-krishna-new-movie-bhagavath-kesari-updates

మరి ఆ ఫోటో ఏంటంటే? బాలయ్య బాబు బుల్లెట్ బండి మీద చాలా వేగంగా ఎవరినో చేజ్ చేసే విధంగా ఆ పిక్ ఉంది. ఆ ఒక్క ఫోటో చూడ్డానికి మాత్రం మామూలుగా లేదు. ఇక కేవలం బాలయ్య అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం ఈ సారి బాలయ్య బాబు యాక్షన్ మామూలుగా ఉండదు అదరగొట్టబోతున్నాడు అంటూ ఇటు సోషల్ మీడియా లోనూ అటు వెబ్ మీడియా లోనూ తెగ వైరల్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇక ఈ చిత్రం విడుదలయ్యాక బాలయ్య బాబు చేజ్ చేస్తున్న ఆ ఫైట్ సీన్ మామూలుగా ఉండబోదు అల్టిమేట్ అదిరిపోయే విధంగా ఉండబోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

See also  Jr NTR : లక్ష్మీప్రణతి విషయంలో కోపంతో ఆ దర్శకుడిపై ఎన్టీఆర్..

bala-krishna-new-movie-bhagavath-kesari-updates

ఇక ఈ బుల్లెట్ బైక్ మీద చేసే సీన్ ఇంటర్వెల్ మధ్యలో ఉండబోతుందంట.. విలన్ వాళ్ళ గుంపును మొత్తం వేటాడుతున్నప్పుడు బాలకృష్ణ ఎంట్రీ అయ్యే ఈ సీన్తో థియేటర్ దద్దరిల్ల బోతుంది. అరుపులు కేకలతో కెవ్వుమనిపిస్తూ థియేటర్ మార్మోగిపోయేలా చేస్తారని.. థియోటర్ దద్దరిల్లడం ఖాయాం అని అంటున్నారు నెటిజన్లు.. ఈ పిక్ వైరల్ అవ్వడంతో బాలయ్య బాబు అభిమానులకు సైతం ఎంతో ఆతృతగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారట.