Bala Krishna Got Insulted: మనందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు ఒకప్పటి స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల సినిమాలలో ఇక హీరోయిన్ గా అవకాశం వచ్చింది అంటే చాలు ఎగిరి గంతేస్తారు. ఎందరో హీరోయిన్లు ఇక ఆ స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లు గా అవకాశం రావాలని ఎంత గానో ఆరాటపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ఇలాంటి గొప్ప స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించేందుకు హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ వదులుకున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారట.. ఇక పైన ఉన్న హీరోలలో బాలయ్య విషయాని కొస్తే బాలయ్యతో అవకాశం వచ్చిన హీరోయిన్లు ఎంత గానో ఆనందపడి ఎగిరి గంతేస్తారు..
కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో ఆయన చిత్రంలో నటించబోనని అయన ముఖం మీద తేల్చి చెప్పి ఆయనను అవమానపరిచిందట.. మరింతకు ఆమె ఎవరు? ఆ సినిమా ఏంటి? అసలు ఏం జరిగింది? అనే విషయాల గురించి మనం ఇప్పుడు చేర్చిద్దాం.. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఓ చిత్రంలో డబల్ యాక్షన్ రోల్ పోషించిన మాస్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ చిత్రం అది చెన్నకేశవరెడ్డి. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ తండ్రి కొడుకులు లాగా నటించారు. ఇక తండ్రి పాత్రకు జోడిగా టబు నటించగా.. కొడుకు పాత్రకు జోడిగా శ్రీయ శరణ్ నటించినది. ఈ సినిమా ఎంతో ఆసక్తి రేకెత్తించింది.
అయితే ఈ చిత్రంలో తండ్రి పాత్రలో బాలకృష్ణకు జోడిగా టబు స్థానంలో రమ్యకృష్ణను తీసుకోవాలని వివి వినాయక్ అనుకున్నాడట.. కానీ ఆమె మాత్రం బాలయ్యతో నటించే అవకాశం వచ్చినప్పటికీ తాను నటించబోనని బాలకృష్ణ ముఖం మీద తేల్చివేసిందట.. ఇక దాంతో దర్శకుడు వివి వినాయక్ చేసేదేమీ లేక టబును ఆశ్రయించి తననే రెండవ హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక ఈ విషయాన్ని స్వయంగా వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బాలకృష్ణతో అవకాశం వచ్చినప్పుడు ఆమె ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయాన్ని గురించి మనకు తెలిసిన సమాచారం.. అది ఎందువల్లనంటే.. అప్పటికే రమ్యకృష్ణ సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రోజులవి..
అలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె ఉన్నట్టుండి ఓ హీరోకి తల్లి పాత్రలో నటిస్తే తన కెరియర్ పై ప్రభావం కచ్చితంగా పడుతుందని ముందుగానే ఆలోచించిది.. ఆ కారణం చేతనే బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట. అందుకే ఎవరు బాధపడ్డా సరే తన కెరియర్ మాత్రం ముఖ్యమని తన కెరియర్ బాగుండాలని నిర్మోహమాటంగా బాలకృష్ణ (Bala Krishna Got Insulted:) ముఖం మీద ఈ విషయం చెప్పడంతో.. అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారట. దాంతో చేసేదేమీ లేకనే రమ్యకృష్ణ స్థానంలో హీరోయిన్ గా టబు ని తీసుకోవడం జరిగిందట. ఇక ఈ చిత్రం అప్పట్లో విడుదలయ్యి రికార్డులు తిరగరాసి సెన్సేషనల్ హిట్ కైవసం చేసిన విషయం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు..