Home Cinema Baby movie: బేబీ చిత్రం యొక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ లపై పోలీస్ కేసు. ఎందుకో తెలుసా.?

Baby movie: బేబీ చిత్రం యొక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ లపై పోలీస్ కేసు. ఎందుకో తెలుసా.?

baby-movie-producer-skn-in-troubled-police-case-registered

Baby Movie: పోయిన సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ స్థాయిలో సంచలనాలు సృష్టించినటువంటి చిత్రం బేబీ. ఇక ఈ చిత్రం 2023 జూలై 14 వ తారీకున విడుదలయి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, హీరోయిన్గా వైష్ణవి చైతన్య జంటగా కలిసి నటించారు. ఇక ఈ చిత్రంలో మరొక కీలకమైన పాత్రలో విరాజ్ ఆనంద్ కూడా నటించాడు. ఇక ఈ చిత్రం నిర్మాతగా (Baby Movie Producer) ఎస్కేఎస్ వ్యవహరించగా, దర్శకత్వం వహించి తెరకెక్కించింది సాయి రాజేష్ గారు..

See also  Vadde Naveen: హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

baby-movie-producer-skn-in-troubled-police-case-registered

ఇక ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి ఊహించని స్థాయిలో అధిక వసూలు కూడా రాబట్టింది. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమిక్స్ చేసి విడుదల చేయబోతున్నాము అంటూ బేబీ నిర్మాత ప్రకటించిన సంగతి తెలిసిందే. . కాగా ఇదంతా మనకు తెలిసిన విషయమే. . అయితే ఇటీవలే మళ్లీ ఈ చిత్రం యొక్క దర్శక నిర్మాతల గురించి ప్రస్తుతం ఒక వార్త అయితే వైరల్ గా మారింది.

See also  Popular senior heros: మన సీనియర్ హీరోల ఆస్తుల వివరాలు తెలిస్తే నోరేళ్ళ పెడతారు..

baby-movie-producer-skn-in-troubled-police-case-registered

అదేంటంటే వీళ్ళిద్దరిపై (Baby Movie Producer) పోలీస్ కేసు నమోదు అయిందట. అందుకు కారణం వీళ్ళిద్దరూ కాపీ రైట్ చట్టం ఉల్లంగించారు అని శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమించొదు అనే టైటిల్ తో కథ నేను చెప్పానంటూ తన చిత్రానికి సినిమా ఆటోగ్రాఫర్ గా పని చేయాలని సాయి రాజేష్ ని కోరినట్లు తెలిపారుట. కానీ ఆ స్టోరీని బేబీ సినిమాలో చూపించారని సదరు ఫిర్యాదులలో తన వాదనను తెలియపరచారు. ఈ విషయం లో అసలు నిజం ఎంతుందనేది తెలియాల్సి ఉంది. కాగా ఒకవేళ ఇదే నిజమైతే ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్ ఆగిపోతుందని అనుకుంటున్నారు.